డీకే అరుణ కుమార్తె ఇంట్లో క్రెడిట్‌ కార్డు చోరీ

డీకే అరుణ కూతురు ఇంట్లో నమ్మిన వ్యక్తే చోరీకి పాల్పడ్డాడు.

By Srikanth Gundamalla
Published on : 7 July 2023 10:39 AM IST

Credit Card, Theft, DK Aruna, Daughter House,

డీకే అరుణ కుమార్తె ఇంట్లో క్రెడిట్‌ కార్డు చోరీ 

బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ కూతురు ఇంట్లో నమ్మిన వ్యక్తే చోరీకి పాల్పడ్డాడు. డీకే శృతిరెడ్డి ఇంట్లో డ్రైవర్‌గా పనిచేస్తున్న బీసన్న క్రెడిట్‌ కార్డుని ఎత్తుకెళ్లాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లోని ప్రేమ్‌ పర్వత్‌ విల్లాస్‌లో శృతిరెడ్డి నివాసం ఉంటున్నారు. ఆ ఇంట్లోనే ఈ ఘటన జరిగింది. ఇటీవల శృతిరెడ్డికి చెందిన క్రెడిట్‌ కార్డుని బీసన్న అపహరించాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి శ్రీమహావీర్‌ జెమ్స్‌ అండ్‌ పెరల్స్‌లో స్వైప్‌ చేసి.. రూ.11 లక్షలు వాడుకున్నాడు. అయితే.. శృతిరెడ్డి ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది. దీని గురించి డ్రైవర్‌ను నిలదీయగా అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలోనే శృతిరెడ్డి డ్రైవర్‌పై దొంగతనం చేశాడని బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో బీసన్నపై పోలీసులు ఐపీసీ 420, 408 కింద కేసు నమోదు చేశారు. అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story