Nalgonda: స్కూటీపై వచ్చి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ప్రేమజంట
ప్రేమ జంటలు సహజంగానే పార్క్‌లు.. సినిమా థియేటర్లు.. హోటల్స్ తిరుగుతుంటారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 12:19 PM ISTNalgonda: స్కూటీపై వచ్చి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ప్రేమజంట
ప్రేమ జంటలు సహజంగానే పార్క్‌లు.. సినిమా థియేటర్లు.. హోటల్స్ తిరుగుతుంటారు. కాలక్షేపం కోసం ఎక్కడో ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటారు. లేదంటే చెట్టాపట్టాలేసుకుని లాంగ్ రైడ్ అంటూ షికారుకి వెళ్లారు. ప్రేమలో మునిగి తేలుతుంటారు. అయితే.. ఇక్కడ ఒక జంట మాత్రం అందరికీ భిన్నంగా ఉన్నారు. కలిసి బైక్ రైడ్‌కు వెళ్లారు. అలావెళ్లిన వారు ఊరికే రాకుండా.. చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్లగొండ జిల్లా మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ జంట స్కూటీపై వెల్తున్నారు. ఆ సమయంలోనే ఓ మహిళ మెడలో నుంచి చైన్‌ను లాగేశారు. దాంతో.. సదురు మహిళ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. వెంటనే అప్రమత్తం అయిన స్థానికులు బైక్‌పై లవర్స్‌ను పట్టుకునేందుకు వెంబడించారు. కానీ.. ఆ ప్రేమ జంట స్కూటీపై దాదాపుగా 100 స్పీడ్‌లో వెళ్లారు. వెనకాలే కొందరు వ్యక్తులు వారిని పట్టుకునేందుకు కొంతదూరం బైక్‌పై వెంబడించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా.. హెల్మెట్ వంటివి ఏవీ లేకుండానే ప్రేమజంట స్కూటీపై పరారయ్యారు. ఆ తర్వాత బాధిత మహిళ మర్రిగూడెం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ప్రదేశంలో సీసీఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
కాగా.. సీసీఫుటేజ్‌లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కనపడటంతో పోలీసులు కూడా ఖంగుతిన్నారు. ఇక ఇదే విషయాన్ని తెలుసుకున్న దేవరకొండ డీసీపీ రంగంలోకి దిగారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్.. వీడియో ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు మొదలుపెట్టారు. ఇక ప్రేమజంట చైన్‌స్నాచింగ్‌కు పాల్పడింది అనే వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ చోరీకి పాల్పడ్డ అమ్మాయి, అబ్బాయి వివరాలు తెలియాల్సి ఉంది.