దారుణం.. మహిళను 30 ముక్కలుగా నరికి.. ఫ్రిడ్జిలో పెట్టి..
మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటోన్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది.
By Srikanth Gundamalla Published on 21 Sept 2024 9:30 PM ISTకర్ణాటకలో కొన్నాళ్ల క్రితం శ్రద్ధావాకర్ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బెంగళూరులో తాజాగా ఇలాంటి సంఘటనే మరోటి జరిగింది. మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటోన్న 29 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. 30కి పైగా ముక్కలుగా నరికి.. వాటిని ఫ్రిడ్జిలో పెట్టాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా.. మృతురాలిని మహాలక్షిగా గుర్తించామని, ఆమె మృతదేహం ఛిద్రమైన స్థితిలో ఉందని చెప్పారు.
వయాలికావల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మహాలక్షికి(29) ఇది వరకే పెళ్లైంది. వ్యక్తిగత కారణాలతో తన బిడ్డతో పాటు మునేశ్వరనగర్లో ఐదు నెలలుగా ఒంటరిగా నివాసం ఉంటోంది. తన భర్త హుకుమ్ సింగ్ నేలమంగళలో నివసిస్తున్నాడు. అయితే.. మహిళకు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. కానీ. అది రీచ్ అవ్వలేదు. స్విచ్ఛాఫ్ వచ్చింది. వెంటనే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి చూశారు. దాంతో.. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ లేబరేటరీ బృందం ఘటనాస్థలిని పరిశీలించారు.
కొద్ది రోజుల క్రితమే ఈ హత్య జరిగిందని పోలీసులు అంటున్నారు. నిందితులు మీతదేహాన్ని 30కి పైగా భాగాలుగా నరికారని చెప్పారు. ఆ తర్వాత వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టారన్నారు. దుర్వాసన రాకుండా రసాయనాలను కూడా చల్లారని.. తర్వాత ఇంటికి తాళం వేసి పారిపోయారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఎవరు హత్య చేశారు...? ఎందుకు హత్య చేశారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.