ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. మానవ అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు
Bengal girls lured by job sold in Bihar forced to go to prostitution.పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని చుచుడా
By M.S.R Published on 2 Jan 2022 6:53 AM GMTపశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని చుచుడా వద్ద ఇద్దరు బాలికల కారణంగా అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాను ఛేదించారు. ఉద్యోగాలు వస్తాయని నమ్మి మోసపోయిన ఇద్దరు బాలికలను మానవ అక్రమ రవాణా ముఠా బారి నుంచి పోలీసులు, మానవ హక్కుల కమిషన్ ఉద్యోగులు రక్షించారు. వీరిలో ఒకరు గిరిజన యువతి కాగా, మరొకరు అవివాహితురాలు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించారని అమ్మాయిలు వాపోయారు. ఉద్యోగం పేరుతో మోసపోయిన తర్వాత వాళ్లను బీహార్‌కు తీసుకెళ్లి విక్రయించారు. అక్కడ వ్యభిచారం చేయమని ఒత్తిడి తెచ్చారు.
నిందితుడైన లీలుదాస్ తమను ఉద్యోగం ఇప్పిస్తానని ప్రలోభపెట్టి బుర్ద్వాన్ నుంచి బీహార్ తీసుకెళ్లినట్లు బాలికలు తెలిపారు. వేరే వారి దగ్గర నుండి డబ్బులు తీసుకుని.. మమ్మల్ని అమ్మేశాడు. అక్కడ తమపై అత్యాచారం చేశారని, ప్రతిరోజూ కొట్టారని బాలికలు చెప్పారు. బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఎలాగోలా రైలు పట్టుకుని బీహార్ నుంచి పారిపోయి సొంత ఊరికి చేరుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. కోర్టు ఆవరణలో వారు అనుమానాస్పద స్థితిలో తిరుగుతూ కనిపించారు.
అక్కడే ఉన్న కొందరు విషయం అడగగా.. తమకు జరిగిన అన్యాయం గురించి తెలిపారు. ఆ తర్వాత మానవ హక్కుల కార్యకర్తలకు సమాచారం అందించారు. మానవహక్కులు, పోలీసు బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. ప్రస్తుతం ఇద్దరు బాలికలను ఉత్తర్‌పరాలోని సురక్షిత గృహంలో ఉంచారు. ప్రస్తుతం నిందితుల గురించి పోలీసులు బాలికలను ప్రశ్నిస్తున్నారు. బాలికలు ఇచ్చిన సమాచారంతో అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాను ఛేదించారు పోలీసులు. ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇలా ఎంతో మంది అమ్మాయిలు మోసపోయినట్లు తెలుస్తోంది.