Adilabad: భార్య ఆత్మహత్య.. భయంతో భర్త కూడా సూసైడ్

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త కూడా సూసైడ్ చేసుకున్నాడు.

By Srikanth Gundamalla  Published on  27 Jan 2024 1:30 PM IST
adilabad, wife,  husband, suicide, same day ,

Adilabad: భార్య ఆత్మహత్య.. భయంతో భర్త కూడా సూసైడ్

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త కూడా సూసైడ్ చేసుకున్నాడు. భార్య చనిపోవడంతో ఆమె మరణం తనపైకి వస్తుందన్న భయంతో భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారిలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన పల్లవితో విజయ్‌కు గతేడాది మే నెలలో వివాహం జరిగింది. అయితే.. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా పల్లవి తన పుట్టింటికి వెళ్లింది. శుక్రవారమే పండగ తర్వాత తన అత్తవారింటికి వచ్చింది. అయితే.. కొల్హారి గ్రామంలో విజయ్‌ కుటుంబం వ్యవసాయం చేస్తూ బతుకు సాగదీస్తుంది. ఇక శుక్రవారం ఇప్పటిలానే అందరూ పొలం పనుల కోసం ఇంటిని వెళ్లారు. ఇక సాయంత్రం వ్యవసాయ పనులు అన్నింటినీ ముగించుకుని విజయ్‌ ఇంటికి వచ్చి చూస్తే భార్య పరుగులు మందు తాగి అపాస్మారక స్థితిలో కనిపించింది.

దాంతో కంగారు పడిపోయిన విజయ్‌ ఆమెను వెంటనే రిమ్స్‌ ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు ఆమెను పరీక్షించి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అయితే.. విజయ్‌ భయపడిపోయాడు. తన భార్య మరణం అపవాదు తనపైకి వస్తుందన్న భయంతో అతను కూడా పురుగుల మందు తాగా సూసైడ్ చేసుకున్నాడు. ఒకేరోజు భార్య భర్తలు ఇద్దరూ చనిపోవడంతో కొల్హారి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పల్లవి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story