హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుండి వస్తున్న ఇద్దరు భారతీయ ప్రయాణీకులను అడ్డుకున్నారు. వారి నుండి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి చెక్-ఇన్ లేగేజీలో ఈ పదార్థాలను దాచారు. కెల్లాగ్స్ కార్న్‌ఫ్లేక్స్, కుకీ బాక్స్‌ల ప్యాకెట్లలో 13 వాక్యూమ్-ప్యాక్డ్ ప్యాకెట్లు కనుగొన్నారు. మొత్తం 13 ప్యాకెట్ల నుంచి ముద్ద రూపంలో ఆకుపచ్చని పదార్ధం బయటపడిందని అధికారులు తెలిపారు. ఫీల్డ్ టెస్ట్ కిట్‌తో పరీక్షించగా, అది గంజాయి అని తేలిందని అధికారులు వివరించారు.
7.096 కిలోల హైడ్రోపోనిక్ వీడ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై NDPS చట్టం, 1985 నిబంధనల ప్రకారం అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది. వారి చెక్-ఇన్ లగేజీని క్రమపద్ధతిలో వెతకగా, కెల్లాగ్స్ చాక్లెట్ ప్యాకెట్లలో 13 వాక్యూమ్-ప్యాక్డ్ పారదర్శక ప్యాకెట్లు కనుగొన్నారు.