ప్రియుడితో బ్రేకప్‌.. సోషల్‌ మీడియాలో బెదిరింపులు, యువతి సూసైడ్

కేరళలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయింది.

By Srikanth Gundamalla
Published on : 20 Jun 2024 8:14 AM IST

18 years girl, social media influencer, suicide, after breakup,

ప్రియుడితో బ్రేకప్‌.. సోషల్‌ మీడియాలో బెదిరింపులు, యువతి సూసైడ్

కేరళలో విషాదం చోటుచేసుకుంది. 18 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయింది. అయితే.. అతని స్నేహితులు యువతిని సోషల్‌ మీడియాలో వేధించడం ప్రారంభించారు. దాంతో.. సదురు యువతి ఆత్మత్య చేసుకుంది. ఈ సంఘటనలో పోలీసులు రంగంలోకి దిగారు. మాజీ ప్రియుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

కేరళకు చెందిన 18 ఏళ్ల యువతి సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె తరచూ వీడియోలు చేస్తూ ఉండేది. ఆమెకు లక్షకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే.. ఆమెకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల ఆమె అతనితో బ్రేక్‌ చేసుకుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న మాజీ ప్రియుడి సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ యువతిని టార్గెట్ చేశారు. ఆమెపై విమర్శలు చేస్తూ కామెంట్స్ పెట్టసాగారు. మూడు నెలల పాటు ఇదే కొనసాగుతూ వస్తోంది. బెదిరింపులు కూడా రావడంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు మాజీ ప్రియుడిని అరెస్ట్ చేశారు. మాజీ ప్రియుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story