తరచూ అత్యాచారం.. వ్యక్తిని చంపిన 15ఏళ్ల బాధిత బాలుడు

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 50 ఏళ్ల వ్యక్తిని 15 సంవత్సరాల బాలుడు హత్య చేశాడు.

By Srikanth Gundamalla  Published on  26 May 2024 12:30 PM IST
15 years boy, kill,   rape,  blackmail,

 తరచూ అత్యాచారం.. వ్యక్తిని చంపిన 15ఏళ్ల బాధిత బాలుడు 

ఉత్తర్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 50 ఏళ్ల వ్యక్తిని 15 సంవత్సరాల బాలుడు హత్య చేశాడు. కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. తరచూ తనని బ్లాక్‌మెయిల్‌ చేస్తుండటంతో.. అలాగే బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతుంటంతో ఈ హత్య చేశాడు. ఈ మేరకు విషయాలను పోలీసులతో బాలుడు వివరాలను వెల్లడించాడు.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ మేరకు వివరాలు తెలిపారు. ముజఫర్‌గనర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో 15 ఏళ్ల బాలుడిపై కొన్ని నెలల క్రితం అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వ్యక్తి వీడియో రికార్డు చేసుకున్నాడు. ఆ వీడియోను చూపించి పలుమార్లు తరచూ బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత సోమవారం కూడా బాలుడిని మరోసారి ఇంటికి పిలిచాడు. బాలుడు రానని చెప్పడంతో వీడియో బయట పెడతానని.. బెదిరించాడు. దాంతో.. ఎలాగైనా ఆ వ్యక్తి పీడ వదలించుకోవాలని భావించాడు బాలుడు. ఇంటికి వస్తున్నానని చెప్పి.. తనతో పాటు ఓ కత్తిని తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన బాలుడిపై మరోసారి అత్యాచారానికి ప్రయత్నిస్తున్న క్రమంలోనే వ్యక్తిని కత్తితో పొడిచాడు. ఆ తర్వాత మెడకోసి దారుణంగా చంపేశాడు.

గత సోమవారమే ఈ హత్య జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు మొబైల్‌ ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ జరపగా.. బాలుడే హత్య చేసి ఉంటారని అనుమానించారు. దాంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఇక శనివారం బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోమ్‌కి తరలించారు.

Next Story