ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ కోసం..స్నేహితుడిని చంపిన 15 ఏళ్ల బాలుడు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 July 2024 8:30 AM ISTఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ కోసం..స్నేహితుడిని చంపిన 15 ఏళ్ల బాలుడు
మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. సెక్టార్ 39లోని ఝార్సా సెక్టార్‌లో 16 ఏళ్లు ఉన్న బాలుడు, 15 ఏళ్ల మరో బాలుడు రెండేళ్లుగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్నేహితులుగా ఉన్నారు. అయితే.. 16ఏళ్ల బాలుడు తన గర్ల్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడని 15 ఏళ్ల బాలుడు సీరియస్ అయ్యాడు. దూరంగా ఉండాలని చెప్పాడు. మొదట ఓకే చెప్పినా.. ఆ తర్వాత మళ్లీ అలాగే చాట్ చేస్తున్నాడు.. మాట్లాడుతున్నాడని తెలుసుకున్నాడు 15 ఏళ్ల బాలుడు. ఈ క్రమంలోనే స్నేహితుడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భారీ స్కెచ్ వేశాడు.
15 ఏళ్ల బాలుడు ఇంట్లో నుంచి రూ.20వేలు దొంగిలిచాడు. ఆ తర్వాత గత మంగళవారం ఇంట్లో నుంచి పారిపోయి..ఓ హోటల్‌లో బస చేశాడు. రూ.12వేలు విలువైన ఫోన్‌ను కొని.. 16 ఏళ్ల బాలుడికి టచ్‌లోకి వచ్చాడు. బుధవారం తనని కలవాలని చెప్పాడు. అంతలోనే ఓ షాపులో నిందితుడు కత్తి కొన్నాడు. గురుగ్రామ్ సెక్టార్ 40లోని ఓ పార్క్ వద్ద వారిద్దరు కలుసుకున్నారు. కోపంతో ఊగిపోయిన ఆ 15ఏళ్ల బాలుడు, బాధితుడి గొంతు, ఛాతీ, మెడ, కడుపు భాగాల్లో కత్తితో బలంగా పొడిచాడు.
తీవ్ర రక్తస్రావంతో ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ 500 మీటర్ల దూరంలోని ఓ ఇంటి ముందు పడిపోయాడు. ఆ తర్వాత తీవ్ర రక్తస్రావమై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయి, రేవారీలో కశోలాలోని తన మామ ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. గురుగ్రామ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. కానీ అక్కడ ట్రైన్ మిస్ అయ్యాడు. చివరికి బస్టాండ్‌కు వచ్చి రేవారీకి బస్సు ఎక్కాడు.
మరోవైపు తన ఇంటి ఎదురుగా మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన యజమాని షాక్ అయ్యాడు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకుని విచారించగా.. అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. తన ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నాడనే కారణంతోనే చంపేశానని ఆ బాలుడు చెప్పాడు. పోలీసుల ప్రకారం బాధితుడు 8వ తరగతి వరకు చదువుకుని రెస్టారెంట్లు, వెడ్డింగ్ ఫంక్షన్స్ లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు.