అదుపు తప్పి లోయలో ప‌డిన బ‌స్సు.. 10 మంది దుర్మ‌ర‌ణం.. ప్ర‌ధాని విచారం

10 dead in Jammu and Kashmir road accident.జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున

By M.S.R  Published on  28 Oct 2021 7:33 AM GMT
అదుపు తప్పి లోయలో ప‌డిన బ‌స్సు.. 10 మంది దుర్మ‌ర‌ణం.. ప్ర‌ధాని విచారం

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున థాత్రి నుంచి దోడాకు వెళ్తున్న మినీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ప‌ది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి ₹ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని థాత్రి, దోడా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. 'ఈ దుఃఖ సమయంలో, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.' అని ప్రధాని ట్వీట్ చేశారు.


అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. "ఇప్పుడే డిసి దోడా వికాస్ శర్మతో మాట్లాడాను, క్షతగాత్రులను GMC దోడాకు తరలించారు. కావాల్సిన సహాయం అందించబడుతుంది" అని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story