ఈ నీచుడికి ఏ శిక్ష వేయాలి... 9 నెలల చిన్నారిపై దారుణంగా...

By Newsmeter.Network  Published on  6 Dec 2019 1:47 PM GMT
ఈ నీచుడికి ఏ శిక్ష వేయాలి... 9 నెలల చిన్నారిపై దారుణంగా...

రోజురోజుకు మానవత్వం మంటగలుస్తోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా మహిళలపై దారుణాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. కొందరు మృగాళ్లు వావివరుసలు లేకుండా నీచంగా ప్రవర్తిస్తున్నారు. వీటిని అరికట్టడానికి ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. కామాంధుల ఆగడాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దిశ కేసులోని నిందితులను శుక్రవారం పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. రోజురోజుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా..తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. నెలలు నిండని ఓ పసిపాపపై కామాంధుడైన మేనమామ అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో వెలుగు చూసింది. ఈ దారుణాలతో సమాజం తలదించుకునేలా ఉంది. ఇలాంటి నీచులను ఏ శిక్ష వేసినా తప్పులేదన్నట్లుగా ఉంది.

శ్యాంపూర్‌ పరిధిలోని బార్గావ్‌ ప్రాంతంలో తొమ్మిది నెలల చిన్నారితో కలిసి ఓ కుటుంబం జీవిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి పక్కనే ఉంటున్న మేనమామ పాపకు బొమ్మలు కొనిస్తానని మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. తిరిగి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించేశాడు. అనంతరం శిశువుకు రక్తస్రావం కావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రక్తపు మరకలను చూసిన తల్లిదండ్రులు అనుమానంతో శ్యాంపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు అనుప్‌ ప్రమానిక్‌ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం( పోక్సో) యాక్ట్‌ కింద నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారిపై ఈ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడటం తీవ్ర సంచనలంగా మారింది.

Next Story
Share it