ఆస్ట్రేలియా వ‌న్డే టీమ్ కెప్టెన్‌గా ధోనీ.. టెస్ట్ సార‌థిగా కోహ్లీ..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Dec 2019 7:17 AM GMT
ఆస్ట్రేలియా వ‌న్డే టీమ్ కెప్టెన్‌గా ధోనీ.. టెస్ట్ సార‌థిగా కోహ్లీ..!

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి అరుదైన గౌరవం దక్కింది. అలాగే ప్ర‌స్తుత వ‌న్డే సార‌థి విరాట్ కోహ్లీకి కూడా అలాంటి గౌర‌వ‌మే ద‌క్కింది. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) వారిద్ద‌రికి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్‌లో ఉత్త‌మ‌ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా క్రికెట్ ఆస్ట్రేలియా.. ఈ దశాబ్దపు ఆసీస్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేసింది. ఇక ప్ర‌స్తుత టీమిండియా సార‌థి విరాట్‌ కోహ్లీకి ఈ ద‌శాబ్ద‌పు ఉత్త‌మ కెప్టెన్‌గా టెస్టు జ‌ట్టు ప‌గ్గాలు అప్ప‌జెప్పింది. అయితే మ‌రో టీమిండియా ఆట‌గాడు రోహిత్‌ శర్మకు వ‌న్డే జ‌ట్టులో చోటు ల‌భించింది.

ఇదిలావుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్ర‌క‌టించిన‌ ఈ వన్డే జట్టులో కేవ‌లం ఒకే ఒక్క ఆసీస్‌ క్రికెటర్‌కు చోటుద‌క్కింది. ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగంలో మిచెల్‌ స్టార్క్‌కు మాత్ర‌మే క్రికెట్‌ ఆస్ట్రేలియా చోటు క‌ల్పించింది. ఇక‌ దక్షిణాఫ్రికా క్రికెటర్లలో హషీమ్‌ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌లకు చోటు క‌ల్పించారు.

బంగ్లాదేశ్ నుండి బ‌హిష్కృత ఆల్‌రౌండ‌ర్‌ షకీబుల్‌ హసన్‌.. ఇంగ్లండ్ జ‌ట్టు నుండి జోస్‌ బట్లర్‌కు ఈ జ‌ట్టులో చోటు ల‌భించింది. న్యూజిలాండ్ జ‌ట్టు నుండి బౌల‌ర్ ట్రెంట్‌ బౌల్ట్‌, అఫ్గానిస్తాన్ జ‌ట్టు నుంచి యువ‌సంచ‌ల‌నం రషీద్‌ ఖాన్‌లకు చోటు ద‌క్కింది. మ‌రో పేస్ బౌల‌ర్‌గా శ్రీలంక నుంచి లసిత్‌ మలింగా చోటు దక్కించుకున్నాడు.

ద‌శాబ్ద‌పు క్రికెట్ ఆస్ట్రేలియా ఉత్త‌మ జ‌ట్టు :

మ‌హేంద్ర‌సింగ్ ధోనీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, హషీమ్‌ ఆమ్లా, విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌, షకీబుల్‌ హసన్‌, జోస్‌ బట్లర్‌(వికెట్‌ కీపర్‌), రషీద్‌ ఖాన్‌, మిచెల్‌ స్టార్క్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, లసిత్‌ మలింగా

దశాబ్దపు క్రికెట్ ఆస్టేలియా ఉత్త‌మ‌ టెస్టు జట్టు :

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), అలెస్టర్‌ కుక్‌, డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, ఏబీ డివిలియర్స్‌(వికెట్‌ కీపర్‌) బెన్‌ స్టోక్స్‌, డేల్‌ స్టెయిన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, నాథన్‌ లయన్‌, జేమ్స్‌ అండర్సన్‌

Next Story