కృష్ణ‌వంశీ మూవీలో బిగ్ బాస్ 3 విన్న‌ర్ న‌టిస్తున్నాడా..?

By Newsmeter.Network  Published on  2 Dec 2019 7:29 AM GMT
కృష్ణ‌వంశీ మూవీలో బిగ్ బాస్ 3 విన్న‌ర్ న‌టిస్తున్నాడా..?

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ చాలా గ్యాప్ త‌ర్వాత ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ రంగ‌మార్తాండ‌. ఇందులో ప్ర‌కాష్ రాజ్, ర‌మ్య‌కృష్ణ జంట‌గా న‌టిస్తున్నారు. స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం ఇందులో ఓ విభిన్న పాత్ర‌ను పోషిస్తున్నారు. అయితే.. ఈ మూవీ గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అది ఏంటంటే.. బిగ్ బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ మూవీలో ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని కృష్ణ‌వంశీ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అలాగే రాహుల్ కూడా ట్విట్ట‌ర్ ద్వారా ఈ మూవీలో న‌టిస్తున్నాను. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి గొప్పనటుల సరసన తాను నటిస్తుండడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని, ఈ అవకాశాన్ని తనకు ప్రసాదించిన దర్శకుడు కృష్ణవంశీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోషల్ మీడియాలో తెలియ‌చేసాడు.షూటింగ్ కోసం ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని, తానెంతో అదృష్టవంతుడ్నని భావిస్తున్నానని సంతోషం వ్య‌క్తం చేసాడు. మరాఠీలో హిట్టయిన నటసామ్రాట్ అనే క్లాసిక్ మూవీకి రీమేక్ ఇది. మ‌రి.. తెలుగులో ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Next Story