రమ్యకృష్ణ, అనసూయ మధ్య సంబంధం ఏంటి..?
By Newsmeter.Network Published on 28 Nov 2019 4:20 PM IST
అందం, అభినయం ఈ రెండూ ఉన్న నటీమణుల్లో రమ్యకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఇక తన అందచందాలతో ఆకట్టుకుని ఓ వైపు యాంకర్ గా, మరో వైపు యాక్టరస్ గా కెరీర్ లో రాణిస్తుంది అనసూయ. ఇప్పుడు వీరిద్దరి మధ్య సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. ఏంటా.. సంబంధం అంటారా..? మేటర్ ఏంటంటే... క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'రంగమార్తాండ'.
ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. వీరి కుమార్తెగా అనసూయ నటిస్తున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, అనసూయ మధ్య పవర్ ఫుల్ సీన్స్ ఉంటాయని తెలిసింది. ఈ సన్నివేశాలు ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకుంటాయని.. ఇంకా చెప్పాలంటే.. ఒక ట్రీట్ లా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
అయితే చాలా గ్యాప్ తర్వాత చేస్తోన్న సినిమా కావడంతో కృష్ణవంశీ చాలా కేర్ తీసుకుని ఈ సినిమా చేస్తున్నారు. ఇందులో హస్య బ్రహ్మా ఓ విభిన్న పాత్రను పోషిస్తున్నారు. ఆ పాత్ర సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. మరీ.. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తోన్న కృష్ణవంశీకి 'రంగమార్తాండ' మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.