హుజూర్‌నగర్ ఉప ఎన్నికను టీఆర్‌ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే ప్ర‌చార ప‌ర్వానికి మంత్రులను కూడా రంగంలోకి దింపింది. తాజాగా సీపీఐ మద్దతు కోరాలని టీఆర్‌ఎస్ నిర్ణయించుకుంది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు టీఆర్‌ఎస్ అగ్రనేతలు కేకే, వినోద్ కుమార్, నామా నాగేశ్వర్రావు సీపీఐ మగ్దూం భవన్‌కు వెళ్లారు. హుజూర్ నగర్ ఉప ఎన్నిక మద్దతుపై సీపీఐ నేతలతో చ‌ర్చ‌లు జరిపి వారి మద్దుతు కోరారు.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.