ముఖ్యాంశాలు

  • బాలాపూర్ పీఎస్ ఏఎస్ఐ ఆత్మాహత్యాయత్నం
  • బదిలీ చేశారని మనస్తాపం చెందిన ఏఎస్ఐ నర్సింహులు
  • ఘటనపై సీపీ మహేష్ భగవత్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్ : బాలాపూర్ పీస్ ASI నరసింహ పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఏఎస్‌ఐ నరసింహను అపోలో డీఆర్‌డీఓ ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్యాయత్నానికి కారణం ఇదేనా?

ASiనర్సింహ బావమరిది ఫంక్షన్ లో ఓ కాంస్టేబుల్ దశరథ్ పై తాగిన మైకంలో గొడవ పెట్టుకొన్నాడు ఆడియో వాయిస్ వైరల్ అవ్వటం దశరథ్ (మంచాల పోలీస్) బాలాపూర్ ఠానా లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇదీ మహేష్ భగవత్ వరకు వెళ్లింది. దీంతో నర్సింహులను మంచాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
దీంతో నర్సింహులు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఏఎస్‌ఐ ఘటనపై సీపీ భగవత్ సీరియస్

బాలాపూర్ ఇన్స్పెక్టర్ సైదులు తో పాటు కానిస్టేబుళ్లను సీపీ మహేష్ భగవత్ బదిలీ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఇటీవలనే.. బాలాపూర్ నుంచి యాచారం పోలీస్ స్టేషన్ కి ఏ ఎస్ ఐ నరసింహ ను బదిలీ చేశారు .బదిలీ కారణంగానే తీవ్ర మనస్థాపానికి గురై నరసింహులు ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం ఉందని మహేష్ భగవత్ చెప్పారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.