మహమ్మారికి చెక్ పెట్టే తొలి వ్యాక్సిన్ మనదేనా?

By సుభాష్  Published on  2 July 2020 6:10 AM GMT
మహమ్మారికి చెక్ పెట్టే తొలి వ్యాక్సిన్ మనదేనా?

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖులు సైతం కరోనాని కట్టడి చేసే విషయంలో ఇతిమిద్దంగా ఇలా జరుగుతుందని చెప్పలేని పరిస్థితి. మరికొంతకాలం వైరస్ తో సహజీవనం చేయాలని తేల్చేస్తున్న వేళ.. అందుకు భిన్నమైన ప్రకటనను చేశారు భారత సంయుక్త డ్రగ్స్ కంటోలర్ డాక్టర్ ఎస్. ఈశ్వరరెడ్డి వెల్లడించారు. ఒక ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.

ఎలాంటి కామెంట్లు లేకుండా.. మూడు నెలల్లో వచ్చే మన వ్యాక్సిన్ మీద ఆయనేం చెప్పారు? ఎలాంటి భరోసా ఇచ్చారు? సదరు వ్యాక్సిన్ పరిశోధన ఇప్పుడెలా సాగుతోంది? లాంటి అంశాలపై ఆయనేం చెప్పారో చూస్తే..

-

కొవిడ్ 19 వ్యాక్సిన్ కు సంబంధించి రెండు దశల్లో క్లీనికల్ టెస్టుల కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కు అనుమతి ఇచ్చాం.

- అంచనాలకు తగ్గట్లు పని జరిగితే రానున్న మూడు నెలల్లో తొలి వ్యాక్సిన్ వచ్చే వీలుంది. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ మనదే అవుతుంది.

- వ్యాక్సిన్ ను జంతువులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయి. అందుకే మానవ పరీక్షలకు అనుమతి ఇచ్చాం.

- సాధారణంగా వ్యాక్సిన్ ను తయారీకి ఆరేళ్లుపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన జరిపిన పరిశోధనలు.. ప్రయోగాలతో సానుకూలం రావటంతో ముందే వ్యాక్సిన్ చేసే వెసులుబాటు కలిగింది.

- కోవ్యాక్సిన్ గా పిలిచే ఈ టీకాను భారత వైద్య మండలికి చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వేరు చేసిన కరోనా స్ట్రెయిన్ తో హైదరాబాద్ లో డెవలప్ చేశారు. మొత్తంగా చూస్తే.. కరోనాకి చెక్ పెట్టే మందు మనదే అయ్యే అవకాశం ఉంది.

Next Story
Share it