కోవిడ్ – 19 దాడి మొదలైన తరువాత నుంచీ చైనాలో ఎక్కడ చూసినా థర్మామీటర్ గన్స్ కనిపిస్తున్నాయి. టోల్ బూత్ ల దగ్గర, అపార్ట్ మెంట్ కాంప్లెక్సుల్లో, హోటళ్లు, సూపర్ మార్కెట్లు, రైల్వే స్టేషన్లలో వైరల్ జ్వరం ఉందో లేదో తెలుసుకునేందుకు, శరీర ఉష్ణోగ్రతను నమోదు చేసేందుకు ప్రయాణికుల నుదుట దగ్గర ఈ థర్మా మీటర్ గన్ ను పెట్టి పరీక్షిస్తున్నారు. ఇన్ ఫ్రా రెడ్ లేజర్ సెన్సార్ ఉన్న ఈ పరికరం శరీరాన్ని తాకకుండానే టెంపరేచర్ ఎంతుందో చెబుతుంది.

కోవిడ్ – 19 వ్యాప్తిని అరికట్టటడంలో ఈ థర్మామీటర్ గన్ ఒక పెద్ద ఆయుధంగా మారింది. ముఖానికి మాస్కులు ఎంత కామన్ అయిపోయాయో థర్మా మీటర్ గన్స్ కూడా అంతే పాపులర్ అయిపోయాయి. మొదట్లో సార్స్ ను అరికట్టేందుకు, ఆ తరువాత ఎబోలాను అరికట్టేందుకు కూడా వీటిని ఉపయోగించడం జరిగింది. ఇవి మనిషి శరీరం నుంచి వెలువడే వేడిమి ఆధారంగా శరీర ఉష్ణోగ్రతను అంచనా వేస్తాయి. అయితే ఇవి ఎంత ఖచ్చితంగా రిజల్ట్స్ ఇస్తాయన్న విషయంలో మాత్రం ఇప్పటికీ సందేహాలున్నాయి. శరీరానికి ఈ థర్మామీటర్ గన్న్ ఎంత దగ్గరగా ఉన్నాయన్న దానిపైనే రీడింగ్స్ ఆదారపడి ఉంటాయి. దుమ్ము బాగా ఉన్న రోడ్లలో ఫలితాలు వేరుగా ఉంటాయని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. అందుకే ఈ థర్మామీటర్ గన్స్ అంత ఖచ్చితంగా పనిచేయమని నిపుణులు అంటున్నారు.

జేమ్స్ లాలర్ అనే వైద్య నిపుణుడు ఎబోలా వైరస్ పరీక్షల సమయంలో చాలా సార్లు తనకు టెంపరేచర్ చాలా తగ్గిపోయినట్టు రీడింగ్స్ వచ్చాయని చెబుతున్నాతకడని అన్నారు. వాస్తవానికి తనకు జ్వరం ఉన్నా థర్మామీటర్ గన్స్ వేరొకలా ఫలితాలను చూపించాయని, గన్స్ చూపిన టెంపరేచర్ లో మనిషి బ్రతకడం అసాధ్యమని ఆయన చెబుతున్నారు. చైనా నుంచి కూడా ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. కొన్ని సార్లు మరీ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే, మరి కొన్ని సార్లు టెంపరేచర్ మోతాదుకు మించి ఉన్నట్టు రిపోర్టులు వస్తున్నాయని వారు చెబుతున్నారు. “ఇవి పనిచేయడం లేదని తెలిసి కూడా వారు మేము ఈ గన్స్ నే వాడుతున్నాం” అని ఒక చైనీయుడు వీబో అనే వారి సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు.

చైనాలో షెంజెన్ లని ఏలీన్ మెడికల్స్ వంటి సంస్థలు ఏడాదికి 2.5 మిలియన్ల థర్మామీటర్ గన్స్ ను తయారు చేస్తున్నాయి.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.