ఏసీలు ఆపి..ఫ్యాన్లను వాడండి : కోవిడ్ -19కు విరుగుడు..

By రాణి  Published on  12 Feb 2020 7:21 AM GMT
ఏసీలు ఆపి..ఫ్యాన్లను వాడండి : కోవిడ్ -19కు విరుగుడు..

కోవిడ్ -19(కరోనా) కు ఇంతవరకూ ఎవరూ అధికారికంగా మందు కనిపెట్టిన దాఖలాలు లేవు. ఇదొక అంటువ్యాధి. చైనాలో దీని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అలాగని ఈ వ్యాధి నుంచి బయటపడినవారు లేకపోలేదు. కానీ...వ్యాధి నుంచి కోలుకునే వారికంటే...రోజూ ఆ వ్యాధి బారిన పడేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. అయితే ఏసీల వాడకాన్ని తగ్గించి, బదులుగా ఫ్యాన్లను వాడితే వైరస్ వ్యాపించకుండా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తాజా గాలి, వెలుతురు తగిలే ప్రదేశాల్లో పేషెంట్లను ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని, రోగుల శరీరంలో ఉంటే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.

కోవిడ్ 19 సూక్ష్మజీవులు పొడిగా, చల్లగా ఉండే వాతావరణంలో అధికంగా వృద్ధి చెందుతాయని తెలిపారు. ఉదాహరణకు వెచ్చటి వాతావరణం ఉన్న సింగపూర్ లో వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటే..సముద్రంలో డైమండ్ ప్రిన్స్ నౌకలో వచ్చిన 3,711 మందిలో 174 మందికి ఈ వైరస్ సోకిందన్నారు. ఇప్పటి వరకూ సింగపూర్ 45 కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ 19ను నిరోధించేందుకు ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడుకు పైన, గాలిలో తేమ శాతం 80కి పైగా ఉండే వాతావరణం ఉత్తమమని సింగపూర్ వైద్యారోగ్య చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ టాన్ ఖోర్ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు జాగ్రత్తగా ఉండాలని, ఈ వైరస్ ఎక్కువగా అలాంటి ప్రాంతాల్లోనే త్వరగా వ్యాప్తి చెందుతుందన్నారు.

Next Story