మ‌రో 1000 మందికి కరోనా వైరస్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Jan 2020 2:30 PM GMT
మ‌రో 1000 మందికి కరోనా వైరస్.!

చైనాను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఆ వైరస్ అక్క‌డి నుండి ఇతర దేశాలకు వ్యాపించింది. ఇక‌ ఇప్పటికే ఈ వైరస్ సోకి చైనాలో 81 మంది మృతి చెందారు. ఈ వైర‌స్ పుట్టుక‌కు, వ్యాప్తికి కేంద్రమైన వూహాన్ నగరంలో అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎవ‌రైనా వ్యాధి లక్షణాలతో కనిపిస్తే వారిని వెనువెంటనే ఆసుపత్రులకు తరలిస్తోంది.

అయితే.. వూహాన్‌లో ప్రస్తుతం 1975 మంది రోగులు ఫ్లూ రోగ లక్షణాలతో సతమతమవుతున్నారు. వీరందరూ కరోనా వైరస్ బారిన పడ్డారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. వీరంద‌రిని చికిత్స నిమిత్తం వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచిన‌ నేపథ్యంలో వూహాన్ నగర్ మేయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న రోగుల సంఖ్యను బట్టి చూస్తే మరో 1000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఇక తాజా స‌మాచారం ప్ర‌కారం ప్రపంచ వ్యాప్తంగా 3000 మందికి ఈ వైరస్‌ సోకినట్టు తెలుస్తోంది.

Next Story