కరోనా వైరస్‌ను గుర్తించిన డాక్టర్ కన్నుమూత

By Newsmeter.Network  Published on  7 Feb 2020 3:45 PM GMT
కరోనా వైరస్‌ను గుర్తించిన డాక్టర్ కన్నుమూత

చైనా పాలకులు, అధికారులను ధిక్కరించి మరీ కరోనా వైరస్ ప్రమాదం గురించి ధైర్యంగా ధిక్కరించిన చైనీస్ డాక్టర్ లీ వెన్లియాంగ్ చనిపోయారు. కరోనా కరాళ నృత్యాన్ని చైనా పాలకుల కిరాతక కృత్యాలను ఎదిరించి, వ్యాధి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన లీ చివరికి అదే వ్యాధితో చనిపోయాడు. ఈ విషయాన్ని ఆయన మిత్రులు ధ్రువీకరిస్తున్నా, చైనా పాలకులు మాత్రం ఇంకా ఆయనకు చికిత్స జరుగుతోందనే నమ్మబలుకుతున్నారు. చైనీస్ వెబ్ సైట్ జెమియన్ ఆయన చనిపోయినట్టు ధ్రువీకరిస్తూ ఫోటోలను కూడా ప్రచురించింది.

లీ ఈ వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించి చైనా అధికారులకు తెలియచేశాడు. కానీ దీని వల్ల టూరిజం, పరిశ్రమలు, ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటాయని అధికారులు ఆయనపై ఒత్తిడి తెచ్చారు. వివరాలను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచారంపై నిషేధాలు విధించారు. అయితే లోలోపల రాజుకుంటున్న నిప్పులా ఒక్కసారి కరోనా వైరస్ భగ్గుమంటూ రావడం వల్ల ఇప్పుడు దాదాపు లక్షలాది మంది దీని బారిన పడ్డారు. వుహాన్ నగరం, హుబై రాష్ట్రాలు పూర్తిగా దిగ్బంధనంలోకి వెళ్లిపోయాయి. ఒక్క వ్యక్తి కూడా రోడ్డు పైకి రాకుండా నిషేధాలు విధించారు. చైనా అధికారికంగా 563 మందే చనిపోయారని చెబుతున్నా, దాదాపు 24689 మంది చనిపోయినట్టు టెన్ సెంట్ అనే వెబ్ సైట్ చెబుతోంది.

ఈ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తూ చేస్తూ డాక్టర్ లీ కి కూడా కరోనా వ్యాధి సోకింది. ఫలితంగా ఆయన కూడా మంచం పట్టాడు. మిగతా డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన చనిపోయారు. చైనా అధ్యక్షుడు గురువారం నుంచి కరోనా వ్యాధిపై ప్రజా యుద్ధం ప్రకటించారు.

Next Story