66 దేశాలకు కరోనా వైరస్‌.. 3వేలు దాటిన మృతులు..

By అంజి  Published on  2 March 2020 5:31 AM GMT
66 దేశాలకు కరోనా వైరస్‌.. 3వేలు దాటిన మృతులు..

ముఖ్యాంశాలు

  • విజృంభిస్తున్న కరోనా
  • కొనసాగుతున్న మరణాలు
  • 66 దేశాలకు వ్యాపించిన కోవిడ్‌

బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ 66 దేశాలకు వ్యాపించింది. ఆయా దేశాల్లో ఎక్కువ మొత్తంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా కరోనా వ్యాపించకుండా ఉండేదుకు అన్ని దేశాల ప్రభుత్వాలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే వరకు కరోనా వైరస్‌ బారిన పడి 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 88,257 మందికి కరోనా వైరస్‌ సోకింది. మృతుల్లో 2,870 మంది చైనాకు చెందిన వారే కావడం గమనార్హం. కాగా ఒక్క రోజు వ్యవధిలోనే 2,338 మందికి ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఈ వైరస్‌ తీవ్రత ఎక్కువగా చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌, జపాన్‌లలో కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాలో కూడా ఇటీవల తొలి కరోనా మరణం నమోదైంది. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఇప్పటికే హెల్త్‌ హెమర్జెన్సీని ప్రకటించారు. ఇటలీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇరాన్‌లో కరోనా మృతుల సంఖ్య 54కు చేరింది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌లోనే నిన్న ఒక్క రోజు 35 మంది మృత్యువాత పడ్డారు. అయితే కొంత కరోనా వైరస్‌ బారి నుండి కోలుకుంటున్నారు. కోలుకున్న వారిలో సైతం తిరిగి కరోనా లక్షణాలు కనబడడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పరాన్న జీవులు, వైరస్‌, బ్యాక్టీరియాలతో జంతువుల నుంచి మనుషులకు కరోనా వైరస్‌ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. కాగా కరోనా వైరస్‌ వల్ల పలు దేశాలు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి.

Next Story