అమెరికాలోనూ ఉచిత కరోనా పరీక్షలు

By సుభాష్  Published on  20 March 2020 6:23 AM GMT
అమెరికాలోనూ ఉచిత కరోనా పరీక్షలు

ఉచితంగా కరోనా పరీక్షలు, బాధితులకు వేతనాలతో కూడిన సెలవులు, ఇన్సూరెన్స్ లు తదితర వెసులుబాట్లు కల్పించే చట్టానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫ్యామిలీ ఫస్ట్‌ కరోనా వైరస్‌ రెస్పాన్స్‌ యాక్ట్‌గా పిలిచే ఈ చట్టం కింద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడానికి దాదాపు రూ. 7.5 లక్షల కోట్లు కేటాయించనున్నారు. అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 10 వేలు దాటింది. మృతుల సంఖ్య 150కి చేరింది. చట్ట సభలకు చెందిన ఇద్దరు సభ్యులకు కూడా కరోనా సోకింది. వైర్‌సను నిరోధించడంలో భాగంగా అమెరికా రొటీన్‌ వీసా సేవలను రద్దు చేసింది. మరోవైపు కరోనా వైర్‌సకు సంబంధించి అధికారిక సమాచారాన్ని ఫేస్‌బుక్‌ అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తుందని, యూజర్ల పేజీల్లో ఈ సమాచారం మొదటగా వచ్చేలా చూస్తామని ఆ సంస్థ వెల్లడించింది. కరోనాను అడ్డుకోవడం కోసం వివిధ దేశాల ప్రజలంతా ప్రభుత్వాల సూచనలు పాటించాలని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ కోరారు. అమెరికాలో ఉన్న భారత విద్యార్థుల ఆరోగ్యం గురించి పట్టించుకోవాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అమెరికా ప్రభుత్వాన్ని భారత రాయబార కార్యాలయం కోరింది.

ఫియాట్‌ కంపెనీకి సంబంధించిన మినికాన్‌, ఓహివోలోని ప్లాంట్‌లలో వేలాది మంది కార్మికులు కరోనా మహమ్మారి కారణంగా పని చేయడానికి నిరాకరించారు. దీంతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కార్మికుల ప్రాణాలకంటే కార్ల ఉత్పత్తే ముఖ్యమనే యాజమాన్యం ధోరణిని కార్మికులు ఆగ్రహించి విధులను బహిష్కరించారు.దీంతో కార్ల తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపాయి.

Next Story