ఇప్పుడు 'ఆంక్షలు' వుహాన్‌లో కాదు.. ఇరాన్‌లో..

By అంజి  Published on  26 Feb 2020 3:03 AM GMT
ఇప్పుడు ఆంక్షలు వుహాన్‌లో కాదు.. ఇరాన్‌లో..

సుమారు నెల రోజుల నుంచి కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు దాదాపు 2400 మందికి పైగా చైనాలో మరణించారు. ఒక్క హుబె ప్రావిన్స్ లోని వుహాన్ నగరంలో ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. వుహాన్ కేంద్రంగానే ఈ వైరస్ విజృంభించిన నేపథ్యంలో చైనా అన్నా వుహాన్ నగరం పేరు చెప్పినా జనం బెంబేలెత్తిపోయారు.

అయితే ఇప్పుడు వుహాన్‌ నగరంలో కొత్త ఇన్ఫెక్షన్‌లు తగ్గుముఖం పడుతుండటంతో నగరంపై విధించిన ఆంక్షలను అక్కడి ప్రభుత్వం పాక్షికంగా తొలగించింది. ఇన్ఫెక్షన్సోకి ఇంకా నయం కాని వారు ప్రత్యేక చికిత్స కోసం, నగరంలో చిక్కుకుపోయిన ఇతర దేశాల వారు ఇతర ప్రాంతాలకు బృందాలుగా వెళ్లవచ్చని నగర పాలక యంత్రాంగం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి కేంద్ర స్థానంగా మారటంతో గత నెల 23 నుండి వుహాన్‌ నగరంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించి ఆ నగరాన్ని దిగ్బంధం చేసిన విషయం తెలిసిందే. వుహాన్‌తో పాటు హువై ప్రావిన్స్‌లోని మరో 18 నగరాలను కూడా ప్రభుత్వం దిగ్బంధం చేసింది. ఈ ఇన్ఫెక్షన్‌తో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ నయం చేసుకుని డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

Coronavirus restrictions in iran

చైనాలోనే 78 వేలమందికి పైగా పైగా ఇన్ఫెక్షన్ కేసులు నమోదు అయ్యాయి. కాగా, ఇప్పుడు ఈ వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, గత ఐదు రోజుల నుంచి రోగులు వైరస్ బారినుంచి బయటపడి బయటకు వెళుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతునట్టుగా చైనా ఆరోగ్య సంస్థ ప్రకటించింది. త్వరలోనే వైరస్ బారి నుంచి చైనా పూర్తిగా కోలుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇతర దేశాలలో..

అయితే చైనా కాకుండా ఇతర దేశాల్లో ఇన్ఫెక్షన్‌ కొత్త కేసులు క్రమంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఇటలీలో ఇప్పటికే 150 కేసులు నమోదు కావటంతో అధికారులు దాదాపు పది పట్టణాలను పూర్తిగా దిగ్బంధం చేశారు. ప్రధాన నగరాలలో స్కూళ్లను మూసివేసి, క్రీడా పోటీలను కూడా రద్దుచేశారు. పాపులర్ సిరీస్ లో భాగంగా వస్తోన్న ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 7’ సినిమా షూటింగ్‌ ను కూడా కాన్సల్ చేశారు. హాలీవుడ్‌ స్టార్‌ హీరో టామ్‌ క్రూయిజ్‌ నటిస్తోన్న ఈ సినిమాను ఇటలీలోని వెనీస్‌లో షూట్‌ చేయాల్సి ఉంది. మూడు వారాలపాటు షూటింగ్‌కు ప్లాన్‌ చేశారు. అయితే కరోనా భయంతో చిత్రబృందాన్ని తిరిగి వెనక్కి రప్పించారు.

Coronavirus restrictions in iran

ఇరాన్‌లో కోవిడ్-19 ఇప్పటికే 12 మందిని బలి తీసుకోవటంతో చైనా తరువాత అత్యధిక కరోనా మృతుల సంఖ్య ఇరాన్‌లో నమోదయినట్లయింది. దక్షిణ కొరియాలో 231 కొత్త కేసులు వెలుగు చూడటంతో మొత్తం కేసుల సంఖ్య 833కు పెరిగింది. ఈ వైరస్‌ బారిన పడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Next Story