కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. ఉపశమనం అదొక్కటే
By సుభాష్ Published on 25 July 2020 4:58 AM GMT24 గంటల వ్యవధిలో కరోనా కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లోని తెలంగాణలో కొత్త కేసుల నమోదు విషయంలో కాస్త ఫర్లేదు కానీ.. ఏపీ పరిస్థితి మాత్రం అనూహ్యంగా మారింది. ఇక.. పలు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. కొద్ది రోజుల క్రితం రోజుకు పదివేల కేసులు నమోదు అవుతున్నాయన్నంతే గుండెలు అదిరేవి. ఇప్పుడు అందుకు భిన్నంగా నలభైవేల వరకు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో.. రానున్న కొద్ది రోజుల్లో రోజుకు లక్ష కేసులు నమోదయ్యే రోజు దగ్గరకు వచ్చేసినట్లుగా చెప్పాలి.
దీంతో.. సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా తొలినాళ్లలో దాదాపు నలభై రోజుల పాటు లాక్ డౌన్ విధించిన దానికి ఏ మాత్రం ప్రయోజనం లేదా? అన్న సందేహాలు తాజా కేసుల నమోదును చూస్తుంటే అర్థం కాక మానదు. ఈ మొత్తం ప్రతికూల సమయంలో ఊరట కలిగించే అంశం ఏదైనా ఉందంటే అది.. రోజురోజుకి పెరుగుతున్న రికవరీ రేటుగా చెప్పక తప్పదు.
తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్ని చూస్తే.. 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా సుమారు 34 వేల మంది డిశ్చార్జి అయ్యారని చెబుతున్నారు. దీంతో.. రివకరీ కేసుల రేటు 63.45కు పెరిగినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరణాల రేటు 2.38 శాతానికి తగ్గినట్లుగా చెబుతున్నరు. గడిచిన మూడు.. నాలుగు రోజులుగా రికవరీల రేటు పెరగటం ఒకందుకు శుభసూచకంగా చెబుతున్నారు.
తాజాగా విడుదల చేసిన గణాంకాల్ని చూస్తే.. సుమారు 8.2 లక్షల మంది కోవిడ్ 19 నుంచి బయపడిపోగా.. మరో 4.4లక్షల మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇప్పటికిప్పుడు ఉన్న యాక్టివ్ కేసులతో పోలిస్తే.. రికవరీ అయిన కేసులే ఎక్కువని.. వారి సంఖ్య సుమారు 3.8లక్షల మంది ఉంటారని ఆరోగ్య శాఖ చెబుతోంది.
పాజిటివ్ ల సంఖ్య తగ్గించేందుకు నిర్దారణ పరీక్షల్ని పెద్దఎత్తున చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకు తగ్గట్లు దేశ వ్యాప్తంగా కరోనా టెస్టుల్ని భారీగా పెంచుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా నిర్దారణ పరీక్షలు ప్రస్తుతం 1290 ప్రయోగశాలల్లో చేస్తున్నారు. వీటిల్లో 897 ప్రభుత్వ ప్రయోగశాలలు అయితే.. 393 ప్రైవేటు ప్రయోగశాలలుగా చెబుతున్నారు. గురువారం ఒక్కరోజునే దేశ వ్యాప్తంగా 3.52లక్షల శాంపిల్స్ టెస్టు చేశారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 1.54 కోట్ల నమూనాల్ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ చెబుతోంది. కేసులు భారీగా నమోదువుతున్నప్పటికి రికవరీ శాతం ఎక్కువగా ఉండటం కాస్తంత ఉపశమనం కలిగించే అంశంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మున్ముందు మరో 12 రకాల సేవలు ఆన్‌లైన్ ద్వారా పొందే విధంగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఈ విధానం వల్ల వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాలకు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి వద్ద నుంచే ఈ సేవలన్నీ పొందవచ్చు.