రష్యా ప్రధానికి కరోనా వైరస్‌

By సుభాష్  Published on  1 May 2020 5:09 AM GMT
రష్యా ప్రధానికి కరోనా వైరస్‌

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోంది. పసికందుల నుంచి వృద్ధుల వరకూ ఎవ్వరిని వదలడం లేదు ఈ కరోనా. ఎంతో మంది ఈ వైరస్‌ బారిన పడి మృత్యువాత పడుతూ, లక్షలాది మంది వైరస్‌తో పోరాటం చేస్తున్నారు. ఇక తాజాగా రష్యా ప్రధాన మంత్రి మైఖైల్‌ మిషుస్తిన్‌ (55)కు కరోనా పాజిటివ్‌ తేలింది. నేను లేషన్‌లో ఉన్నాను అంటూ మీడియాకు వెల్లడించినట్లు ఓ అంతర్జాతీయ వార్త సంస్థ వెల్లడించింది.

ఇక ప్రధానికి కరోనా పాజిటివ్‌ వచ్చినందున పూర్తిస్థాయిలో నయం అయ్యే వరకూ ఆ బాద్యతలన్నీ ఉప ప్రధాని ఆండ్రూయ్‌ బెలూసోన్‌ నిర్వర్తించనున్నారు.

దేశానికి సంబంధించి కొన్ని విధానపరమైన అంశాలపై తాను ప్రధానితో టచ్‌లో ఉంటానని ఆయన పేర్కొన్నారు. కాగా, రష్యా ఆర్థిక వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయాలు, విధానాలు రూపొందించడంలో మిషుస్తిన్‌ పాల్గొంటారని అధ్యక్షుడు వ్లాదిమి పుతిన్‌ తెలిపారు. ప్రధానికి కరోనా వచ్చినట్లు తనతో చెప్పినట్లు అధ్యక్షుడు పుతిన్‌ తెలిపారు. అయితే మిషుస్తిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అఖరుసారి ఎప్పుడు కలిశారనేది ఇంకా తెలియరాలేదు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అధ్యక్షుడు సమావేశాలన్నీ రద్దు చేసుకుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. కాగా, మైఖైల్‌ మిషుస్తిన్‌ రష్యా దేశ ప్రధానిగా గత ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించారు.

Next Story