'కరోనా' డెవలప్‌ వెనక అమెరికా శాస్త్రవేత్త.. మరీ లీకేజీకి కారణాలేంటీ.?

By అంజి  Published on  11 Feb 2020 6:40 AM GMT
కరోనా డెవలప్‌ వెనక అమెరికా శాస్త్రవేత్త.. మరీ లీకేజీకి కారణాలేంటీ.?

అమెరికా‌: 'చైనా 'జీవాయుధం' వెనక అమెరికన్‌ శాస్త్రవేత!.. వెలికి వస్తున్న కరోనా వైరస్‌ రహస్యాలు' అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం రాసింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి కారణంగా అనుమానిస్తున్న జీవాయుధ తయారీ వెనక అమెరికా శాస్త్రవేత్త ఉన్నారా.? అంటే.. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో చైనా వెలువరించిన కథనాలను చూస్తే నిజమేననిపిస్తోంది.

వుహాన్‌ యూనివర్సిటీలో చార్లెస్‌ లీబర్‌ అనే శాస్త్రవేత్త ఓ జీవ-రసాయన ల్యాబ్‌ను నెలకొల్పి.. జీవాయుధాల పరిశోధనలో సహకరిస్తున్నాడని, ఈ పరిశోధనా క్రమంలోనే వైరస్‌ బయటకి లీకై.. ఇప్పుడు మెల్ల మెల్లగా ప్రపంచాన్ని కమ్మేస్తోందన్నది వాదన. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తికి.. వుహాన్‌ వర్సిటీలోని ల్యాబ్‌లో జరిగిన పరిశోధనలకు మధ్య సంబంధం ఉందని ప్రపంచ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కాగా ఇది ధ్రువీకరణ మాత్రం కాలేదు.

నానో టెక్నాలజీలో నిపుణుడైన ఫ్రొఫెసర్‌ చార్లెస్‌ లీబర్‌ అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్‌ యూనివర్సిటీలో కెమిస్ట్‌ పని చేస్తున్నారు. ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచిన లీబర్‌ను జనవరి 28న ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. లీబర్‌తో పాటు మరో ఇద్దరు రీసెర్చి విద్యార్థులను కూడా అరెస్ట్‌ చేశారు. చైనా నుంచి పొందుతున్న ఆర్థిక సాయం గురించి లీబర్‌ను ప్రభుత్వానికి తెలియపర్చలేదు. ఆ విషయం తనకు తెలియదని లీబర్‌ అబద్ధమడాడు. ఈ నేపథ్యంలోనే అతడిని అక్కడి ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది. అమెరికా చట్టం ప్రకారం.. ఏ పౌరుడైనా విదేశీ సాయం పొందినప్పుడు.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలి. అరెస్టయిన మరో ఇద్దరిలో ఒకరు చైనా సైన్యంలో లెఫ్టినెంట్‌ హోదాల పని చేస్తుండగా, మరోకరు లోగాన్‌లో విమానం ఎక్కుతుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని వద్ద ఉన్న 21 జీవ పరిశోధన శాంపిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ తర్వాత రెండు రోజుల పాటు లీబర్‌ను ప్రశ్నించాక.. 10 లక్షల డాలర్ల పూచీకత్తుతో స్థానిక అమెరికా కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అదే సమయంలో దేశం విడిచి పారిపోరాదని.. షరతులు విధించింది. ఈ విషయం గురించి తెలుసుకున్న హ్వారర్డ్‌ యూనివర్సిటీ.. అతడి సస్పెండ్‌ చేసింది. థౌజెండ్‌ టాలెంట్స్‌ ప్లాన్‌ పేరిట చైనా ఓ పరిశోధనా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మేధావులను ఆకర్షించి.. తమ యూనివర్సిటీల్లో చైనా పరిశోధనలు కొనసాగిస్తోంది. థౌజెండ్‌ టాలెంట్స్‌ ప్లాన్‌పై అమెరికాకు ఎప్పటి నుంచో కన్ను ఉంది. తమ దేశానికి చెందిన మేధాసంపత్తులను ఆకర్షిస్తోందని అమెరికా భయం. అయితే దానిని ఎప్పటినుంచో దెబ్బతీయాలని అమెరికా చూస్తూ వస్తోంది.

ఎఫ్‌బీఐ ఆరా..

చైనా తన పరిశోధనల్లో భాగంగా చార్లెస్‌ లీబర్‌ను సంప్రదించింది. ఆయన నెల సరి వేతనంగా రూ.50 వేల డాలర్లతో పాటు వ్యక్తి గత ఖర్చులకు మరో 1.50 లక్షల డాలర్లను ఇస్తోంది. ఆయన వుహాన్‌ యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ ల్యాబ్‌ ఏర్పాటు కూడా పూర్తిగా కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అయితే తమ ప్రొఫెసరే ఇలాంటి పని చేస్తారని అమెరికా ఎన్నడూ ఊహించలేదు. మొత్తానికి లీబర్‌ అరెస్ట్‌ అనేక అనుమానాలకు తావిస్తోంది. లీబర్‌ నిజంగానే వుహాన్‌ యూనివర్సిటీలో ఈ వైరస్‌ను డెవలప్‌ చేశాడా అనే చర్చ మొదలైంది. లీబర్‌ అరెస్ట్‌కు, కరోనా వైరస్‌ వ్యాపికి సంబంధించిన ఎఫ్‌బీఐ పూర్తి స్థాయిలో ఆరా తీస్తోంది.

Next Story