హైదరాబాద్ కీ తప్పని కరోనా వైరస్ దెబ్బ

By రాణి  Published on  1 Feb 2020 12:15 PM GMT
హైదరాబాద్ కీ తప్పని కరోనా వైరస్ దెబ్బ

ముఖ్యాంశాలు

  • హైదరాబాద్ చుట్టుపక్కల లెక్కలేనన్ని ఫార్మా కంపెనీలు
  • ఆర్థికంగా హైదరాబాద్ ని దెబ్బకొడుతున్న కరోనా..
  • వాటికి ఎపిఐల దిగుమతి చైనానుంచే ఎక్కువ భాగం
  • ప్రస్తుతం చైనాలో ఆగిపోయిన ప్రొడక్షన్, స్టాక్ కొరత
  • భారత్ కి పూర్తిగా నిలిచిపోయిన దిగుమతులు

చైనాని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ హైదరాబాద్ ని కూడా మరోలా భయపెడుతోంది. ఆ ప్రాణాంతకమైన వైరస్ మన తెలంగాణలో అడుగుపెట్టిన దాఖలాలు ఇప్పటి వరకైతే లేవుగానీ ఆర్థికంగా మాత్రం వ్యాపారస్తులందర్నీ విపరీతంగా దెబ్బతీస్తోంది. ప్లాస్టిక్ సామాను మొదలు ఇంటికి పెట్టుకునే తలుపుల దాకా, మంచి నీళ్ల బాటిల్ నుంచి తినే అన్నం ప్లేటు దాకా అన్నింటా అన్నీ పూర్తిగా ఇప్పుడు భారత్ లో చైనా వస్తువులే రాజ్యమేలుతున్నాయి. ఆఖరికి ఫార్మాకంపెనీలకు అందే మూలరూపంలోని పౌడర్లు, మందులు, అరుకులు కూడా. చైనాలో కరోనా వైరస్ ప్రబలడంవల్ల, వేలాదిమంది ఆ వైరస్ బారిన పడడంవల్ల ఇప్పుడక్కడంతా స్తంభించిపోయింది. చాలా వేగంగా వ్యాప్తి చెందే వైరస్ కనుక, కేవలం గాలి ద్వారా మాత్రమే అది వేగంగా వ్యాప్తిచెందుతుందికనుక కరోనా భయానికి మొత్తం చైనా చైనాయే మూత పడిపోయిందని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే చెప్పే పరిస్థితి ఇప్పుడక్కడ నెలకొంది.

ముఖ్యంగా వూహాన్ ప్రాంతంలో అయితే పూర్తిగా ఇండస్ట్రీస్ అన్నీ మూతపడ్డాయి. ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయింది. ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి. అలు అక్కడే రిటైల్ షాపుల్లో, దుకాణాల్లో ఆహారం, మంచినీళ్లు, మందులు సరిగ్గా దొరికే వ్యవస్థ పూర్తిగా అందుబాటులో లేదు. జనానికి మందులు, ఆహారాపదార్థాల్ని చవకగా ఇవ్వాల్సిందిగా రిటైలర్లుకు స్వయంగా కింగ్ లీ పిలుపు ఇచ్చారు.

సాధారణ వ్యాపారుల నుంచి బడాబాబుల దాకా విలవిల

తరచూ చైనాకు వెళ్లి ఆర్డర్లు ప్లేస్ చేసి స్టాక్ ని ఇండియాకి రప్పించుకునే వ్యాపారస్తులు ఇప్పుడు చైనా పేరు చెబితేనే గడగడలాడిపోతున్నారు. చేతిలో ఉన్న స్టాక్ ఎక్కువకాలం వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయిపోయాక ఏం చేయాలో తెలీదు. చైనాలో ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోయిందికాబట్టి దగ్గరి దాపుల్లో మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపించట్లేదుకాబట్టి, తయారీ నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితిలో చైనాలో ఉన్న మాన్యుఫాక్చరింగ్ కంపెనీలుకూడా ఉన్న స్టాక్ తోనే పని గడుపుకుంటున్నాయి.

బయలుదేరని కార్గో, ఎప్పుడు బయలుదేరుతుందో తెలీదు

సరే కనీసం ఆ స్టాక్ నైనా భారత్ కి పంపించాలన్నా కార్గో షిప్ దాకా అవి చేరడం, కార్గో మన దేశానికి రావడం లాంటి పనులు జరగడానికైనా బోల్డంత సమయం పట్టేది పట్టేదే. ఈ లోపుగా చైనానుంచి వస్తువుల్ని దిగుమతి చేసుకునేవాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే అతి చవకగా దొరికే చైనా వస్తువుల్ని ఓ మాదిరి లాభం వేసుకుని అమ్మేస్తే మార్కెట్లో వీటికి చాలా త్వరగా మూవ్ మెంట్ ఉంటుంది. గాజు - పింగాణీ వస్తువులు, ప్లాస్టిస్ వస్తువులు, అలంకరణ సామాగ్రి, ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే ముడి పదార్థాలు, బట్టలు ఒకటేంటి అన్నీ చాలా తక్కువ ధరలకే దొరికే వస్తువులే కాబట్టి జనం, వ్యాపారులు, రిటైలర్లు అందరూ వాటికి చాలా బాగా అలవాటు పడిపోయారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు చైనానుంచి మన దేశానికి, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న పలు ఫార్మా కంపెనీలకు అవసరమైన యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇన్ గ్రేడియెంట్స్ అంటే ఎపిఐలుకూడా దిగుమతి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

మందులు తయారుచేయడానికి అవసరమైన వివిధ రకాల కెమికల్ కంపోజిషన్లతోకూడిన పౌడర్లు, ద్రవాలను ఎపిఐ అంటారు. చైనాలో ఉన్న వివిధ ప్రదేశాల్లోని అనేక కంపెనీల్లో తయారైన ఎపిఐలు, మధ్యంతర ఉత్పత్తులు టన్నులకొద్దీ భారత్ కి దిగుమతి అవుతాయి. వీటిని ఉపయోగించుకుని తమ ఫార్ములాలు, కంపోజిషన్ల ప్రకారం ఫార్మా కంపెనీలు చాలా తేలిగ్గా మందుల్ని తయారుచేస్తాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా అక్కడ ఇండస్ట్రీస్ అన్నీ మూత పడిపోవడంతో మళ్లీ అవి తెరుచుకునే దాకా ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మన ఫార్మాకంపెనీలకు గడ్డు పరిస్థితిని తట్టుకోక తప్పేట్టుగా కనిపించడంలేదు. సరుకు సరఫరా చేయలేని పరిస్థితిలో చైనా కంపెనీలు మళ్లీ స్టాక్ ని పంపడానికి కొద్దికాలంపాటు సమయం కావాలని అడుగుతున్నాయి. కానీ ఆ కొద్దికాలం ఎంతకాలం అన్నదానికి మాత్రం ఎవరిదగ్గరా సమాధానం లేదు.

మరో ముఖ్యమైన విషయం కూడా జనం మెదళ్లని బలంగా తొలుస్తోంది. అదేంటంటే చైనా చాలా రోజులుగా బయో వెపన్స్ ని తయారుచేసి ప్రపంచంలో కొన్ని దేశాలమీదికి వదలాలని చూస్తోందన్న ప్రచారం విశ్వవ్యాప్తంగా జరుగుతున్న విషయమూ తెలిసిందే. అలాంటి తరుణంలో కరోనాని వేరే దేశం నుంచి తెప్పించుకుని మరీ కెలుక్కుని దెబ్బతిని కుదేలైపోయిన చైనా ప్రత్యర్థిదేశమైన మన దేశాన్ని అంత సులభంగా ఎందుకు వదిలిపెడుతుందన్నది ఇప్పుడు వైద్యనిపుణులు చెబుతున్న మాట.

ఒకవేళ ఎపిఐలలో దేనిలోనైనా సరే పౌడర్ గానీ, లిక్విడ్ గానీ ఏదైనా సరే..దానిలో కరోనా వైరస్ కలిసి ఉంటే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ఇటు పౌరుల మెదళ్లను, అటు ఫార్మా కంపెనీల యజమానుల మెదళ్లను తొలుస్తోంది. ఈ అనుమానం పూర్తిగా పోనంతవరకూ మళ్లీ చైనా నుంచి స్టాక్ తెప్పించుకునే సాహసం ఎవరూ చేయనుగాక చేయరు. స్టాక్ రాకపోతే మందులు తయారు చేయడానికి కాదు. లేదంటే మరేదైనా దేశం నుంచి ఎపిఐని దిగుమతి చేసుకోవడం తప్ప మరోమార్గం లేదు.

Next Story