తల్లిపాలతో కరోనా సోకదు!

By Newsmeter.Network  Published on  14 May 2020 8:57 AM IST
తల్లిపాలతో కరోనా సోకదు!

కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించి ప్రజలను ఇండ్లకే పరిమితం చేశాయి. దీంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌లోనూ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. తాజాగా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఇదిలాఉంటే కరోనా మహమ్మారితో గర్భిణీలకు మరింత ముప్పు ఉందని వైద్యులు సూచించారు. దీంతో గుర్భిణిలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలువురు గర్భిణీలకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పుట్టబోయే బిడ్డను కరోనా వైరస్‌ ఎక్కడ బలితీసుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

Also Read :తెలంగాణ‌లో మ‌రో 41 క‌రోనా కేసులు

కానీ వారికి వైద్యులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. తల్లిపాలను తాగడం ద్వారా శిశువులకు కరోనా సోకదని చెబుతున్నారు. ఈ విషయంపై గాంధీ ఆస్పత్రి గైనకాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్‌ మహాలక్ష్మీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనితలు తెలిపారు. ఓ కరోనా పాజిటివ్‌ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చిందని, బిడ్డకు వైరస్‌ సోకలేదని వైద్యులు వెల్లడించారు. తల్లిd, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. పాజిటివ్‌ సోకిన తల్లిపాలలో కరోనా వైరస్‌ ఉండదని చెబుతున్నారు. గ్రంథుల నుంచి స్రవించే ద్రవాల్లో మాత్రమే.. అంటే చెమట, లాలాజలం వంటి వాటిలోనే వైరస్‌ ఉంటుందని, గర్భస్థ శిశువుకు గానీ లేదా మాయ ట్రాన్స్‌ మిషన్‌కు గానీ వైరస్‌ ఉన్నట్లు నిర్దారణ కాలేదని చెప్పారు. తల్లిపాలలో లభించే యాంటీబాడీ కరోనాతో పోరాడేందుకు సహాయపడుతుందని నిపుణులు ఇప్పటికే తెలిపారు. తల్లికి పాజిటివ్‌ ఉన్నప్పటికీ.. అది శిశువుకు సక్రమించకుండా తల్లిపాలు కాపాడతాయని చెప్పారు. యాంటీ బాడీస్‌ శరీరంలో తయారయ్యే ప్రొటీన్లు శరీరానికి వెలుపల బ్యాక్టీరియా, వైరస్‌తో పోరాడే సార్థ్యాన్ని పెంపొందిస్తాయని వైద్యులు తెలిపారు.

Also Reda : ప్రభుత్వ అలసత్వమే.. కరోనా మహమ్మారి తీవ్రంగా పెరగడానికి కారణమయ్యిందా..?

ప్రసవ సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది పేషెంట్‌తో పాటు వైద్య సిబ్బందికి పెద్ద చాలెంజ్‌ అని చెప్పారు. ఏ మాత్రం ఏమరపాటు జరిగినా బిడ్డకు వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పాజిటివ్‌ గర్భిణీకి జన్మించే శిశువుకు కరోనా సోకే అవకాశం ఒక్క శాతమే ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story