సిగరేట్ తాగేవారికి కరోనా ముప్పు.. ఎలా అంటే..?
By Newsmeter.Network Published on 27 March 2020 2:35 PM ISTమీరు సిగరేట్ తాగుతున్నారా.. బీడీ తాగుతున్నారా.. ఇదంతా ఎందుకు పొగతాగుతున్నారా..? అయితే జాగ్రత్త..! మీకు కరోనా లక్షణాలు వచ్చే అవకాశం ఎక్కువ. పొగ తాగేవారిని కరోనా వైరస్ మరింత ఆకర్షిస్తుందంట. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు.. కరోనా వైరస్‌పై తీవ్రస్థాయిలో పరిశోధనలు జరిపిన చైనా శాస్త్రవేత్తలు. వారి పరిశోధనల్లో మిగిలిన వారితో పోలిస్తే ధూమపానం చేసేవారిలో వైరస్ సోకే అవకాశం 14రెట్లు ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా సోకిన వేలాది మందిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పొగతాగే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కరోనా వైరస్ సోకేందుకు ఈ అంశమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఎక్కువగా వైరస్ సోకుతుందట.
మామూలుగా శుభ్రత కోసం ఊపిరితిత్తులు మ్యూకస్ పొరను ఉత్పత్తి చేస్తాయని, అయితే పొగతాగేవారిలో ఈ మ్యూకన్ పొర మందంగా ఉండటంతో వ్యర్థాలను బయటికి పంపేందుకు ఊపిరితిత్తులు చాలా కష్టపడతాయని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే స్నేహితులు సరదాగా దమ్ముకొట్టే సమయంలో ఒకరి సిగరేట్ ఒకరు మార్చుకొని తాగుతుంటారు. లేదా ఒకే సిగరేట్‌ను ఇద్దరు, ముగ్గురు కలిపి తాగుతుంటారు. ఇది సరదా చేస్తున్నా.. ఈ విధానం వల్ల కరోనా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయంట. ఇలా పొగ తాగే వారిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. మరి జాగ్రత్త.. కరోనా వైరస్ భారి నుండి తప్పించుకోవాలంటే సింగరేట్, బీడీ ఇతర వాటి ద్వారా పొగ తాగేవారూ జాగ్రత్తగా ఉండాల్సిందే మరి. ఇదిలాఉంటే పొగాకు ఉత్పత్తులైన గుట్కా, జర్దాలను తిని రోడ్లపై ఉమ్మడం కారణంగా కూడా ఉత్తరాధి రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాపిస్తోందని వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్‌న ముఖోపాధ్యాయ ఆందోళన వ్యక్తం చేశారు.