రోజుకు 5 లక్షల పీపీఈ కిట్లు తయారవుతున్నాయి: కేంద్ర మంత్రి

By సుభాష్  Published on  27 Sep 2020 10:29 AM GMT
రోజుకు 5 లక్షల పీపీఈ కిట్లు తయారవుతున్నాయి: కేంద్ర మంత్రి

దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్నతరుణంలో ఎందరో కరోనా బారిన పడుతూ, ఎందరో మృత్యువాత పడుతున్నారు. అయితే దేశంలో రోజుకు 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. 110 చోట్ల నుంచి అందుబాటులోకి వస్తున్న ఈ కిట్లు అన్ని రాష్ట్రాలకు కావాల్సినన్ని పంపిస్తున్నట్లు చెప్పారు. గతంలో పీపీఈ కిట్లు కొరత ఉందన్న రాష్ట్రాలే ప్రస్తుతం వాటిని నిల్వ చేసుకునేందుకు కావాల్సిన స్థలం లేదనే స్థాయికి చేరినట్లు ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ఏడు కోట్ల కరోనా పరీలు నిర్వహించగా, 82 శాతం రికవరీ రేటు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1823 కోవిడ్‌ ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కాగా, భారత్‌ లో గడిచిన 24 గంటల్లో 9,87,861 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 88,600 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1124 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 59 లక్షల 92వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 94,503కు చేరుకోగా, కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 49వేలకు చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 9 లక్షల 56వేల కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువకాగా, అమెరికాలో ఆ సంఖ్య 70 లక్షలకు చేరింది. ఇప్పటి వరకు అమెరికాలో 2 లక్షల 4వేల మంది కరోనాతో మృతి చెందారు.

Next Story
Share it