కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూనే ఉంది. ఆయా దేశాలు ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను విధించాయి. ఇందులో భారత్‌, అమెరికా వంటి దేశాలు కూడా ఉన్నాయి. పలు దేశాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. అమెరికాలో ఇప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. రోజుకు వందల సంఖ్యలో ఆస్పత్రుల బాటపడుతున్నారు. కరోనా వైరస్‌పై నిరంతరం పరీక్షలు చేస్తున్న వైద్యులు ఈ వైరస్‌ రోజురోజుకు వివిధ రూపాల్లో రూపాంతరం చెందుతుందని పేర్కొంటున్నారు.

Also Read :మావోల చెరనుండి భర్తను విడిపించుకున్న భార్య

ఊపరితిత్తుల వ్యాధికంటే ఈ వైరస్‌ భయంకరమైందని అమెరికా వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన వారి శరీర అవయవాల్లో రక్తం గట్టిపడటం, గడ్డకట్టడం వంటి సంకేతాలు కనపడుతున్నాయని అక్కడి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా శరీరాన్ని వైరస్‌ నాశనం చేసే అవకాశాలు ఎక్కువ అని, కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవటానికి కూడా ఈ వైరస్సే కారణంగా కనపడుతోందని యూనివర్శిటీ ఆఫ్‌ ప్లోరిడాకు చెందిన వైద్యుడు స్కాట్‌ బ్రాకెన్‌ రిడ్జ్‌ హెచ్చరించారు. ఈ వైరస్‌ సోకిన రోగిలో కిడ్నీ డయాలసిస్‌ కాథెటర్స్‌ గడ్డకట్టడాన్ని గమనించి నట్లు తెలిపారు. దీనికితోడు వైరస్‌ సోకిన వారిలో ఊపిరితిత్తుల భాగాలు రక్తరహితంగా ఉన్నాయని పల్మనాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఈ వైరస్‌ ఇన్ని రకాలుగా శరీరానికి హాని కలిగిస్తుండటంతో అమెరికన్‌ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే కరోనా వైరస్‌ సోకిన రోగులకు రక్త గడ్డకడుతున్నట్లు సంకేతాలు లేనప్పటికీ ముందుగానే రక్తం సన్నపడటానికి అధిక మోతాదులో డ్రగ్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా వైరస్‌ శరీర భాగాల్లో వేగంగా వ్యాప్తిచెందకుండా ఉపయోగపడుతుందని తెలిపారు.

Also Read :హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు.. కానీ..!

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *