తెలంగాణ కరోనా: 24 గంటల్లో ఎన్ని కేసులంటే..
By సుభాష్ Published on 11 Sep 2020 3:24 AM GMT
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. గతంలో కొంత తక్కువ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య పెరిగిపోయింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 2426 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 13 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,52,3602 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 940 మంది కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక మరణాల రేటు పరిశీలిస్తే రాష్ట్రంలో 061 శాతం ఉండగా, దేశంలో 1.67 శాతం ఉంది. ఇక కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 78.2 శాతం ఉంటే, అదే భారత్‌లో 77.63 శాతం ఉంది. రాష్ట్రంలో 32,195 యాక్టివ్ కేసులుండగా, 25,195 హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్ నమోదైన జిల్లాలు.. హైదరాబాద్ 338, రంగారెడ్డి 216, మేడ్చల్ మల్కాజిగిరి 172, నల్గొండ 164, కరీంనగర్ 129, వరంగల్ అర్బన్ 108 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మిగతా జిల్లాల్లో వంద లోపు కేసులు నమోదయ్యాయి.