మహమ్మారి కరోనా ఉద్ధృతం.. 15 వేలు దాటిన మరణాలు..

By అంజి  Published on  23 March 2020 12:58 PM GMT
మహమ్మారి కరోనా ఉద్ధృతం.. 15 వేలు దాటిన మరణాలు..

హైదరాబాద్‌: భూమండలంపై కరోనా వైరస్‌ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోని అన్ని దేశాల ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. అయినప్పటికి కరోనా మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కరోనా ధాటికి మరణించిన వారి సంఖ్య 15,189కి చేరింది. ఇందులో యూరోప్‌కి చెందిన వారే 9,197 మంది ఉండడం గమనార్హం.

ఇటలీలో మృతుల సంఖ్య 5,476కు చేరింది. చైనాలో 3,270, స్పెయిన్‌లో 2,182 మంది కరోనా సోకి మృత్యు వాత పడ్డారు. స్పెయిన్‌ దేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి గత 24 గంటల్లోనే 1,395 మంది మృతి చెందారు. అందులో 462 మంది స్పెయిన్‌ దేశానికి చెందిన వారే ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య 2,182కి చేరిందని ఆ దేశ వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులోనే 27 శాతం మరణాల సంఖ్య పెరగడం అక్కడి వారిన తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

ఇటలీ.. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలోనూ కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న దేశం..అత్యల్ప జనాభా ఉన్న దేశం ఇది. ఇప్పుడీ దేశాన్ని చూస్తే ఎవరికైనా గుండె చలించక మానదు. నిత్యం వందలాదిమంది కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నా..80 ఏళ్లు పైబడిన వారికి అక్కడ చికిత్స చేయడం లేదు. నిజానికి జనవరి మధ్య నుంచే ఇటలీలో కరోనా నెమ్మదిగా తనకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుందనడంలో అతిశయోక్తి లేదు. కరోనా ఇంతలా వ్యాపించడంలో డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఉంది.

Next Story