ఓ పోలీస్‌స్టేషన్‌లో మహిళా సీఐకి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో ఏకంగా స్టేషనే మూసివేశారు. తమిళనాడు-చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలోని సుమారు30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వానియంబడి తాలుకా పోలీస్ స్టేషన్‌లో మహిళా సీఐకి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పోలీస్‌ స్టేషన్‌ను సైతం మూసివేశారు. సీఐతో పాటు ఒకరిద్దరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మహిళా సీఐని చికిత్స నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్టేషన్‌ను మూసివేసిన అధికారులు..37 మంది సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.