గల్ఫ్‌లో కరోనా మొదటి మృతి

By అంజి  Published on  17 March 2020 2:31 AM GMT
గల్ఫ్‌లో కరోనా మొదటి మృతి

గల్ఫ్‌ దేశాలలో కరోనా వైరస్‌ తొలి మృతి వెలుగులోకి వచ్చింది. బెహ్రెయిన్‌కు చెందిన ఒక మహిళ ఈ వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది.ఈమె కొద్ది రోజుల క్రితమే ఇరాన్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది.

అయితే ఆమె డైరెక్ట్ గా ఎవరిని కలవలేదని, వచ్చిన రోజు నుంచి నిర్బంధం లోనే ఉండటంవల్ల పెద్దగా భయపడాల్సిన పని లేదని చెబుతున్నారు.

అంతేకాదు తాజాగా కరోనా వ్యాధిగ్రస్తులు 17 మంది కోలుకున్నారని తెలిపారు. మొత్తానికి బెహ్రెయిన్‌ లో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య 189 కాగా, కోలుకున్న వారి సంఖ్య 77. అంతేకాదు గత రెండు వారాలుగా సౌత్ కొరియా, ఇటలీ, ఈజిప్ట్, లెబనాన్ నుంచి వచ్చిన వాళ్ళు స్వీయ నిర్బంధం లో ఉండాల్సిందిగా సూచించింది. కరోనా దెబ్బకు గల్ఫ్ రాష్ట్రాలను రెండు వారాలపాటు షట్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించారు.అంతేకాదు.. ఉద్యోగులకు కూడా 14 రోజుల వరకు హాలీడే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మార్కెట్లు, కేఫ్‌లు, హెల్త్ క్లబులపై కూడా నిషేధం విధించారు.

ఇది ఇలా ఉండగా జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కార్మికులను ’కరోనా వైరస్‌’ వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని వేలాది మంది పురుషులు, మహిళలు ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ సహా వివిధ దేశాలకు వలసబాట పట్టారు.అయితే ఇప్పుడు అక్కడి నుంచి స్వస్థలాలకు వస్తున్న వ్యక్తులు స్వల్ప అనారోగ్యానికి గురైనా కరోనా సోకిందనే భయంతో ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలను నిర్ధారించేందుకు కొన్ని రోజుల వ్యవధి పట్టనుండడంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన వారు ఆందోళనతో ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు.

Next Story