చైనాలో కరోనా విలయ తాండవం

By రాణి  Published on  8 Feb 2020 7:34 AM GMT
చైనాలో కరోనా విలయ తాండవం

మృత్యువు హాహాకారాలు చేస్తూ..విలయ తాండవం చేస్తోంది చైనాలో. రోజురోజుకూ కరోనా బారి నుంచి బయటపడిన వారికంటే మృత్యు ఒడికి చేరుతున్న వారి సంఖ్యే ఎక్కువవుతోంది. చైనాలో ఈ మృత్యుఘోష అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తోంది. బయటికి రావాలంటే భయం. ఎవరితో అయినా మాట్లాడాలంటే భయం. కనీసం కలిసి హ్యాండ్ షేక్ కూడా ఇవ్వలేని దుస్థితి. కరోనా కేవలం తుమ్మడం, దగ్గడం ద్వారానే కాకుండా హ్యాండ్ షేక్, కౌగిలించుకోవడం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరిగింది. దీంతో చైనా తో పాటు యావత్ ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో చైనీయులను చూస్తే చాలు..భయపడి ఆమడదూరం పారిపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇతర దేశాల్లో ఉన్న చైనీయులను అంటరానివారిగానే చూస్తున్నారు. తమకు ఎలాంటి వైరస్ లేదని, వైద్యపరీక్షల్లో నెగిటివ్ వచ్చిందని చెప్పినా సరే..ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే చైనా ప్రత్యక్ష యుద్ధం చేయలేక ఇలా ఎక్కడలేని ప్రయోగాలు చేసి కరోనాను ఇతర దేశాల మీదికి వదిలాలనుకుని..తమ దేశంలో ప్రజలే చనిపోవడానికి కారణమైందన్న వార్తలు ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నాయి. దీంతో చైనీయులను ఎవరూ తమ వద్దకు రానివ్వడం లేదు.

కాగా..శుక్రవారం నాటికి చైనా కరోనా మృతుల సంఖ్య 636గా ఉండగా..శనివారానికి మృతుల సంఖ్య 724కు చేరింది. గురువారం ఒక్కరోజే 70 మందికి పైగా మృతి చెందగా..శుక్రవారం కరోనా మహమ్మారి 88 మందిని బలి తీసుకుంది. ఇప్పటి వరకూ చైనా కరోనా మృతు సంఖ్య 724కు చేరింది. ఇందులో మరింత బాధించే విషయమేమిటంటే అప్పుడే పుట్టిన పాపకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా వైరస్ సోకిన గర్భిణీ ఒక పాపకు జన్మనివ్వగా..పాపను 30 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆ తర్వాత ఆ పాపకు కూడా కరోనా వైరస్ సోకిందని తేలడంతో సదరు ఆస్పత్రి వైద్యులు దిగ్ర్భాంతి చెందారు. గతంలో కూడా వైరస్ సోకిన గర్భిణీ పాపకు జన్మనివ్వగా..ఆ పాప పూర్తి ఆరోగ్యంగా ఉంది. ఈ పాప విషయంలో కూడా అలాగే జరుగుతుందనుకున్నారు వైద్యులు. కానీ విధి వక్రించింది.

సార్స్ వైరస్ బారినపడి మృతి చెందిన వారి కంటే కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. హుబెయ్ ప్రావిన్స్ లోనే 79 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 3,399 మందికి కరోనా పాజిటివ్ రిజల్ట్స్ రావడంతో ఈ వైరస్ బాధితుల సంఖ్య 34,872కు చేరింది. కరోనా వ్యాప్తికి మూలమైన వూహాన్ ఇంకా నిర్భందం లోనే ఉండగా..హాంకాంగ్ లో కూడా ఇదే తరహా ఆంక్షలు కొనసాగుతున్నాయి.

Next Story