ఐక్యరాజ్యసమితిలో కరోనా కలకలం.. ఐదు దేశాల ప్రతినిధులకు పాజిటివ్‌

By సుభాష్  Published on  28 Oct 2020 3:52 AM GMT
ఐక్యరాజ్యసమితిలో కరోనా కలకలం.. ఐదు దేశాల ప్రతినిధులకు పాజిటివ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు. తాజాగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (యూనైటెడ్‌ నేషన్స్‌) ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కార్యాలయంలో ఉన్న ఐదు దేశాల ప్రతినిధులకు కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో వ్యక్తిగత సమావేశాలను రద్ద చేస్తూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థకు చెందిన అధికార ప్రతినిధి తెలిపారు. 'యూఎన్‌లో ఐదుగురికి కరోనా సోకింది. వెంటనే అప్రమత్తమై యూఎన్‌ మెడికల్‌ సర్వీస్‌ కాంటాక్ట్లను ట్రేస్ చేసే పనిలోపడ్డారు. మంగళవారం జరగాల్సిన వ్యక్తిగత సమావేశాలకు రద్దు చేశాము' అని ప్రతినిధి స్పీఫెన్‌ దుజారిక్ పేర్కొన్నారు. అయితే ఈ ఐదుగురు ప్రతినిధులు ఏ దేశాలకు చెందిన వారన్న విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కాగా, కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్‌తో కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినా..కొన్ని దేశాల్లో పెరుగుతోంది. తగ్గుముఖం పట్టినా.. ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. పండగలు, శుభకార్యాలయాలలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని, భౌతిక దూరం, మాస్క్‌ తప్పని సరిగా ధరిస్తూనే ఉండాలని, లేకపోతే మరింత విజృంభించే అవకాశాలున్నాయని సూచించించింది. ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో కరోనా కలకలం రేపుతోంది.

Next Story