ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్‌ భారిన పడి వేలాది మంది ఆస్ప్రతుల బాట పడుతుండగా.. వందలాది మంది మృత్యువాత పడుతున్నారు. వైరస్‌ ఉధృతి రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమవుతున్నాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వైరస్‌ భారిన పడకుండా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 6,727 మంది వైరస్‌ సోకి ఆస్పత్రుల బాట పట్టగా వారిలో 231 మంది మరణించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు 596 మంది వైరస్‌ భారి నుండి కోలుకున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం నిర్ణయించిన లాక్‌డౌన్‌ గడువు ఈనెల 14తో ముగియనున్న నేపథ్యంలో.. ఆ గడువును మరింత పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.

Also Read : అకాల వర్ష బీభత్సం.. ఏపీలో 14 మంది మృతి..

ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఒరిస్సా ప్రభుత్వం ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ను పొడగించగా, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆధిత్యనాథ్‌.. ఆ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో ఈనెల 30వరకు లాక్‌డౌన్‌ పొడగించారు. ఇలా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పొడగించేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో కేంద్రం సైతం ఈనెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసులను నివారించేందుకు లాక్‌డౌన్‌ పొడగింపు నిర్ణయం తప్పని సరి అని కేంద్రం భావిస్తోంది. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి వరుసలో ఉంది. ఈ రాష్ట్రంలో 1,364 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటికే 97 మంది మృతిచెందడగా, 125మంది కోలుకున్నారు. తరువాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఈ రాష్ట్రంలో 834 మంది వైరస్‌ భారిన పడగా 8మంది చనిపోయారు. ఢిల్లిలో 720 మందికి, తెలంగాణలో 471, మధ్యప్రదేశ్‌లో 426, రాజస్థాన్‌లో 463, ఉత్తరప్రదేశ్‌లో 410, ఏపీలో 363, కేరళలలో 357 మంది కరోనా వైరస్‌ భారిన పడి చికిత్స పొందుతున్నారు.

Newsmeter.Network

Next Story