రెండు రూపాయల కోసం కొట్లాట.. ఒకరు మృతి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 6:13 AM GMT
రెండు రూపాయల కోసం కొట్లాట.. ఒకరు మృతి.!

తూర్పుగోదావరి: మనుషులు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీస్తున్నారు, తీసుకుంటున్నారు. గొడవ చిన్నదయినా, పెద్దదయినా టార్గెట్‌ మాత్రం మనిషి ప్రాణమే అవుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనం.. వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ మండలం వలసపాకలలో రెండు రూపాయల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో సువర్ణరాజు అనే వ్యక్తి మృతి చెందాడు. ఓ సైకిల్‌ షాపులో తన సైకిల్‌కు సువర్ణరాజు గాలి పెట్టించుకున్నాడు. దీంతో సైకిల్‌కు గాలి పెట్టాక డబ్బులు ఇవ్వాలని సువర్ణరాజును షాపు యాజమాని కోరాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. షాపు యాజమాని సాంబపై సువర్ణరాజు దాడికి పాల్పడ్డారు. దీంతో షాపు యాజమాని స్నేహితుడు అప్పారావు కత్తితో సువర్ణరాజును పొడిచాడు. అతడిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సువర్ణరాజు (24) మృతి చెందాడు.

Next Story
Share it