పవన్ ర్యాలీకి భవన కార్మికులు ఎందుకు దూరంగా ఉన్నారు..?!

By సత్య ప్రియ  Published on  4 Nov 2019 9:15 AM GMT
పవన్ ర్యాలీకి భవన కార్మికులు ఎందుకు దూరంగా ఉన్నారు..?!

ఇసుక కొరత సమస్య ను నిరసిస్తూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో తలపెట్టిన లాంగ్ మార్చ్ నవంబర్ 3, ఆదివారం రోజున జరిగింది. పవన్ కళ్యాణ ఫ్యాన్సు, యువకులూ వేలాదిగా ఇందులో పాల్గొన్నారు. అయితే, ఎవరి కోసమైతే ఈ ర్యాలీ చేపట్టారో ఆ భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ లో ఎక్కువ సంఖ్యలో పాల్గొనలేదు.

ఇసుక కొరత వల్ల ఉపాధి కోల్పోయి కార్మికులు రోడ్డున పడ్డారు. 36 మంది భవన కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. వారి ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించేందుకు జన సేన ఈ ర్యాలీ చేపట్టిందని చెప్పారు. అయితే, ఈ ర్యాలీ నామమాత్రంగా జరిగింది. పవన్ కళ్యాణ్ ఇందులో పూర్తిగా పాలుపంచుకోలేదు.

సుమారు, 4.10 గం. లకు మద్దిలపాలెం లో కొద్ది సమయం చేరి తరువాత మీటింగ్ కు తరలివెళ్లారు. సిపిఐ, సిపిఎం పార్టీలు పాల్గొనని కారణంగా చాలా కొద్దిమంది కార్మికులు పాల్గొన్నారు. మద్దిలపాలెం లో ర్యాలీ మొదలయినా తెలుగు తల్లి విగ్రహానికి దండ కూడా ఎవరూ వేయలేదని విశ్లేషకులు అంటున్నారు.ర్యాలీ తరువాత, రోడ్లు ఖాళీ వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్ల తో నిండిపోయాయి. ఒకసారి వాడే ప్లాస్టిక్ కవర్లను నిషధించాలని పలికే జన సేన పార్టీ కార్యకర్త ల ఈ చర్యను స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

మార్చ్ తరువాత జరిగిన మీటింగ్ లో మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడుతుండగా ముగ్గురు యువకులకు కరెంట్ షాక్ తగిలింది. గాయపడ్డ వీరిని ఆసుపత్రి కి తరళించారు. అందులో రమణా రెడ్డి అనే 16 ఏళ్ల కుర్రాడికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మిగితా ఇద్దరూ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. వారు ఇరన్ రాడ్డు వద్ద నిలబడడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

జెనరేటర్ ఆపి వేయడంతో మీటింగ్ కొద్దిసేపు నిలిపేయాల్సి వచ్చింది. ఈ ర్యాలీలో భవన కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనలేదని డెక్కన్ క్రానికల్ వార్త ప్రచురించింది.

Dc

Next Story