క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణానికి తొలిగిన అడ్డంకులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2019 10:24 AM GMT
క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణానికి తొలిగిన అడ్డంకులు

కృష్ణా: క్షిపణి పరీక్షా కేంద్రం నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ రెండో దశ అనుమతులు మంజూరు చేసింది. దీంతో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత వాసుల కల నెరవేరబోతోంది.

ఈ మేరకు సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. పరీక్ష కేంద్రానికి ఇచ్చిన 157.42 హెక్టార్ల భూమి డీఆర్‌డీఓ చేతికి రానుంది. ఇక నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. అయితే ఇతర జీవాల మనుగడకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్మాణం జరిగేలా అధికారులు పనులు చేపట్టనున్నారు. నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతాన్ని పరీక్షా కేంద్రానికి అనువైనదిగా అధికారులు గుర్తించారు. ఇక్కడికి రావడం వల్ల స్థానికంగా మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయని అధికారులు అన్నారు.

కానీ..ఈ ప్రాజెక్టు ద్వారా భూములు కోల్పోయిన రైతులు మాత్రం ఇప్పటి వరకు తమకు పూర్తి నష్టపరిహారం అంతలేని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు.

Next Story