కర్బన ఉద్గారాలతో వాతావరణం ఎంత కలుషితం అవుతున్నది మన అందరికి తెలుసు. దీనికి ప్రధాన కారణాలు పరిశ్రమలు, రవాణా వ్యవస్థ అని కూడా తెలుసు. ఈ క్రమంలో భాగంగానే బ్రిటన్ లోని ‘యార్క్ సిటీ’ డీజిల్ పెట్రోల్ తో సంబంధం లేకుండా అన్ని ప్రైవేటు కార్లను పూర్తిగా నిషేధిస్తుందిని..  ప్రజలను తీసుకెళ్లే బస్సులను దివ్యాంగులను తీసుకెళ్లే వాహనాలను తప్ప మిగితా ప్రైవేటు వాహనాలన్నింటిని నిషేధించాలని నగర్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది.

ఈ నిషేధ పరిధి నగరం చుట్టూ నిర్మించిన గోడల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. రోమన్ కాలంలో నిర్మిచిన గోడలు ఇప్పటికి చాల దృడంగా ఉన్నాయని . అదేవిధంగా ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లను కూడా నిషేధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ప్రతి సంవత్సరం 70 లక్షల మంది పర్యాటకులు ఈ నగరాన్ని సందర్శిస్తున్నారని అందువల్లనే ఇక్కడ వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ భావిస్తుంది.

నగరంలో పలు ప్రాంతాల్లో కాలుష్య ప్రమాణాలు భారీగా తగ్గిపోయిన కారణంగా 2030 వరకు నగరంలో కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గిచాలని నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ లక్ష్యంగా పెట్టుకొంది. దీనిలో భాగంగానే 2023 నాటికీ పూర్తీ స్థాయిలో కార్లను నిషేదించాలని నిర్ణయం తీసుకుంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.