అమరావతి: రాష్ట్రాభివృద్ధికి ముందుకు రావాలని ప్రవాసాంధ్రులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. 'కనక్ట్ టూ ఆంధ్రా' పేరుతో వెబ్ పోర్టల్ ప్రారంభించారు. ఈ వెబ్ పోర్టల్ ద్వారా ఎవరైనా సాయం చేయవచ్చు. దీనికి సీఎం చైర్మన్‌గా, సీఎస్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. వెబ్ పోర్టల్ ప్రారంభించిన తరువాత ప్రవాసాంధ్రులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. రాష్ట్రంపై ప్రేమాభిమానులు చూపించడానికి మంచి అవకాశమన్నారు. సంక్షేమ పథకాలు కూడా చేపట్ట వచ్చు అన్నారు.
మరోవైపు ఆర్కే కనక్ట్ టూ ఆంధ్రా కుతన జీతాన్ని విరాళంగా ఇచ్చారు.