కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గృహనిర్బంధం..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 8:30 AM GMT
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గృహనిర్బంధం..

సంగారెడ్డి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండబోదని అన్ని వర్గాల ప్రజలు అనుకున్నారు. కానీ తెలంగాణలో ఇంత అన్యాయమైన, దారుణమైన పరిస్థితులు ఉంటాయని ఎవ్వరూ ఊహించలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సుదీర్ఘంగా నడుస్తున్న ఉద్యమం ఆర్టీసీ సమ్మె అని అన్నారు. సమ్మెకు ప్రజల, కార్మిక, ఉద్యోగ సంఘాల మద్దతు పెరుగుతున్న.. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని జగ్గారెడ్డి మండిపడ్డారు.

ఒక పక్క హైకోర్టు ప్రభుత్వాన్ని చీవాట్లు పెడుతున్న.. ప్రభుత్వం మౌనం వహిస్తుండటం ఒంటెద్దు పోకడలకు నిదర్శమన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విషయం నాదృష్టికి తీసుకువచ్చి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయి ఉండేదన్నారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని.. చాలీ చాలని వేతనాలతో గొడ్డు చాకిరి చేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణలో పోలీస్‌ రాజ్యం నడుస్తోందన్నారు. పోలీసులతో ఉద్యమాన్ని అణచి ప్రజల గొంతు నొక్కుతున్నారన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ నా పూర్తి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Next Story