కోనాన్ నిజమైన హీరో: ట్రంప్
By Newsmeter.Network Published on 26 Nov 2019 11:46 AM GMT
అమెరికా: దాని పేరు కోనాన్. బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం అది. అయితే కోనాన్ ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీని హతమార్చడంలో ఎంతో కీలకపాత్ర పొషిచింది. ఈ క్రమంలో కోనాన్‌కు ఓ మోస్తరు గాయాలయ్యాయి. ప్రస్తుతం కోలుకుని విధుల్లో చేరిన ఈ వీర శునకానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇచ్చారు. ట్రంప్ తన భార్య మెలానియా, వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌తో కలిసి కోనన్‌తో సరదాగా గడిపారు. ఆ శునకం ట్రయినర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ మేరకు ట్రంప్ మాట్లాడుతూ.. 'ఇది కోనన్.. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ శునకం' అంటూ స్వయంగా ఆ శునకం గురించి చెప్పారు. అంతేకాకుండా ‘కోనన్ ఇక్కడ ఉన్నందుకు మాకెంతో గౌరవంగా ఉందన్నారు. ఈ శునకానికి సర్టిఫికేట్, అవార్డు ఇచ్చామన్నారు. కొనాన్ ను రియల్ హీరో అంటూ అభివర్ణించారు. వీటిని మేం వైట్ హౌస్‌లో ఉంచబోతున్నాం' అని ట్రంప్ విలేకర్లతో అన్నారు