కట్, కాపీ, పేస్ట్ ఇక లేరు

By రాణి  Published on  20 Feb 2020 1:14 PM GMT
కట్, కాపీ, పేస్ట్ ఇక లేరు

కట్ (ctrl x), కాపీ(ctrl p), పేస్ట్(ctrl v) ఇవి మనం సర్వసాధారణంగా కంప్యూటర్ లో వాడే షార్ట్ కట్ లు. ఇవైతే వాడుతున్నాం గానీ..ఇవి కనిపెట్టిన శాస్ర్తవేత్త ఎవరో మనకింతవరకూ తెలీదు. వీటిని కనిపెట్టింది కంప్యూటర్ శాస్ర్తవేత్త లర్రీ టెస్లర్ (74). కట్ , కాపీ, పేస్ట్ మాత్రమే కాదు.. find & replace, ఇంకా చాలా షార్ట్ కట్ లను కనిపెట్టింది ఈయనే. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు గుర్తొంచిందనుకుంటున్నారా ? కెనడాకు చెందిన లర్రీ టెస్లర్ గురువారం మరణించారు.

1945సంవత్సరంలో న్యూ యార్క్ లో పుట్టిన లర్రీ..కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. అలా డిగ్రీ పూర్తయ్యాక కంప్యూటర్ పై ఆసక్తితో రకరకాల ప్రయోగాలు చేసి..షార్ట్ కట్ లను కనిపెట్టాడు. 1960 నుంచి లర్రీ టెస్లర్ సిలికాన్ వాలీలో పనిచేస్తుండేవారు. అప్పట్లో చాలా మందికి కంప్యూటర్ వాడుక గురించి తెలియదు. లర్రీ టెస్లర్ వల్ల చాలా మంది కంప్యూటర్ వాడకం, ఉపయోగాల గురించి తెలుసుకుని ఉపాధి పొందారు.

అదేవిధంగా జిరాక్స్ పాలో ఆల్టో రీసెర్చ్ సెంటర్ (parc) ను కూడా స్థాపించారు. కొంతకాలానికి యాపిల్ సంస్థ కూడా లర్రీకి జాబ్ ఆఫర్ ఇచ్చింది. యాపిల్ సంస్థలో పనిచేసి..కొంతకాలం తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్ ను ప్రారంభించారు. అలాగే ఈయన అమెజాన్, యాహూ సంస్థలకు కూడా పనిచేశారు.

Next Story