ఆ అమ్మాయిలు మందేశారు.. వారి ప్రిన్సిపాల్ గెంటేశాడు..!
By Newsmeter.Network Published on 31 Dec 2019 2:43 PM GMTమద్యపానం ఆరోగ్యానికి హానికరం తెలుసు కదా.. ఇది తెలిసి కూడా ఈ విద్యార్థులు తమ పరిధిని దాటారు. వారి భవిష్యత్తుకు వారే అడ్డుకట్ట వేసుకున్నారు. వివరాల్లోకెళితే.. తమిళనాడు నాగపట్నంలో నలుగురు విద్యార్థినులు వారి ఫ్రెండ్స్ తో కలిసి ఆరు వారాల క్రితం పార్టీ చేసుకున్నారు. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కుడా మద్యం సేవించారు. బీర్ తాగుతున్న విద్యార్థినుల దృశ్యాలను అందులోని ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినులు తీరును తప్పుబడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయం డిసెంబర్ 24వ తేదీన కాలేజ్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో ఆ కాలేజ్ ప్రిన్సిపల్.. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అయితే విద్యార్థినుల చర్య కాలేజ్‌కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండటంతో.. వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిష్కరణ 2020 జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. అయితే తమిళనాడులో 21 ఏళ్లు పైబడ్డవారు మద్యం సేవించడం చట్టబద్ధం కాగా, ఆ నలుగురు విద్యార్థినుల వయసు అంతకన్నా తక్కువగా ఉంది.