ముఖ్యాంశాలు

  • కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం
  • సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. పట్టణంలోని వ్యాపార వర్గాల వద్ద నిధి సేకరణ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ.. 33 రోజులుగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుంది అన్నారు.ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రజలందరూ ఈ న్యాయమైన సమ్మె పట్ల అనుకూలంగా ఉన్నారని , త్వరలోనే ప్రజా పోరాటం మారబోతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.కార్మికుల కుటుంబానికి సహకరించిన అందరికీ సీపీఎం పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి భూక్యా రమేష్ , నాయకులు లిక్కి బాలరాజు, సండకురి లక్ష్మి, రాజారావు, డి వీరన్న, కీహెచ్ ప్రసాద్, జయశ్రీ, ఆలేటి శ్రీనివాస్, వంకాయల రాజు, కళంగి హరికృష్ణ, వలమల చందర్రావు, దుర్గమ్మ, ఆలేటి శ్రీనివాస్ పాల్గొన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.