నా కోకోను వెతికిపెట్టండి.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Feb 2020 3:20 PM GMT
నా కోకోను వెతికిపెట్టండి.!

పెంపుడు జంతువులపై మనకు ఎంతటి ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంట్లో ఉన్నంతసేపు ఒక్క క్షణం కూడా వాటిని వదిలిపెట్టకుండా ఉండేవాళ్లు ఎందరో ఉంటారు. తమ పిల్లలతో సమానంగా వాటిపై ప్రేమను చూపిస్తుంటారు. అంతా ప్రేమగా పెంచుకున్న జంతువు తప్పిపోతే ఎలా ఉంటదో ఊహించుకోవడం కష్టం. ఆ ఆవేదన మాటల్లో చెప్పలేనిది.

అయితే.. తాను పెంచుకుంటున్న కోకో(కుక్క పిల్ల) కనిపించడంలేదని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు మిస్సింగ్​ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్​ తెలిపారు.

Next Story